Home Page Slider

ప్రభాస్ “సలార్” సినిమా ప్రేక్షకులను మెప్పించిందా..?

Share with

డార్లింగ్ హీరో ప్రభాస్ అభిమానులు ఎప్పుడెప్పుడా అని వెయ్యి కళ్లతో ఎదురు చూస్తోన్న “సలార్” సినిమా ఇవాళ ప్రేక్షకుల ముందుకు వచ్చిన విషయం తెలిసిందే.  బాహుబలితో పాన్ ఇండియా స్టార్‌గా గుర్తింపు పొందిన ప్రభాస్ కొత్త సినిమా “సలార్”.కాగా ఈ సినిమాకు కేజీయఫ్ స్టార్ డైరక్టర్ ప్రశాంత్ నీల్ దర్శకత్వం వహించారు.వీరిద్దరి పవర్‌ఫుల్ కాంబినేషన్‌లో వచ్చిన సలార్ సినిమాపై ప్రేక్షకులతోపాటు సినిమా ఇండస్ట్రీకి భారీ అంచనాలు ఉన్నాయి. దీంతో ప్రేక్షకులు ఈ సినిమా కోసం ఎంతో ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు.ఈ మేరకు ఈ సినిమా విడుదలకు వారం రోజుల ముందు నుంచే ప్రేక్షకుల్లో “సలార్” ఫీవర్ మొదలైనట్లు కన్పించింది. అయితే ఎటువంటి ప్రీ రిలీజ్ ఈవెంట్లు ప్రమోషన్లు లేకుండా విడుదలైన “సలార్” సినిమా ఎలా ఉందో తెలుసుకోవాలనుకుంటున్నారా?

 ఈ సినిమాలో ఓ రాజ్యానికి సంబంధించిన కుర్చీ కోసం జరిగే పోరాటంలో తన స్నేహితుడికి ప్రభాస్ ఇచ్చిన విలువను దర్శకుడు ప్రశాంత్ నీల్ అద్భుతంగా తెరకెక్కించారు. ఈ సినిమాలో కేజీయఫ్‌కు మించి ఉన్న  ప్రభాస్ ఎలివేషన్స్ ,ప్రభాస్ –పృథ్వీరాజ్ సీన్లు,యాక్షన్ సన్నివేశాలు,ఇంటర్వెల్ సీక్వెన్స్  ప్రేక్షకులను ఆకట్టుకునేలా ఉన్నాయి. అయితే ఈ సినిమాలో ఉన్న ఎక్కువ క్యారెక్టర్ల వల్ల ప్రేక్షకులు కొంచెం కన్‌ఫ్యూజ్ అయ్యే ఛాన్స్ కన్పిస్తోంది. కాగా ఈ సినిమాలో BGM ఇంకా కొంచెం బాగుంటే సినిమా వేరే లెవల్‌లో ఉండేదని కొందరు అభిప్రాయపడుతున్నారు. ఈ సినిమాలో తర్వాత ఏం జరుగుతుందనే ఆసక్తిని రేకెత్తిస్తూ పార్ట్-1కు ముగింపు పలికారు.