Home Page SliderInternational

క్రికెట్ కోసం ఫుడ్ డెలివరీ జాబ్ చేశా..నెదర్లాండ్స్ పేసర్ ‘వాన్ మీకెరెన్’

Share with

తాజాగా దక్షిణాఫ్రికాను పసికూన నెదర్లాండ్స్ మట్టి కరిపించిన సంగతి తెలిసిందే. ఈ విజయంలో కీలక పాత్ర పోషించిన నెదర్లాండ్స్ పేసర్ వాన్ మీకెరెన్ సోషల్ మీడియా పోస్టు వైరల్ అయ్యింది. కరోనా సమయంలో క్రికెట్ కోసం ఫుడ్ డెలివరీ జాబ్ చేశానంటూ మూడేళ్ల క్రితం పోస్టు చేశారు. కరోనా విజృంభణ సమయంలో టీ 20 ప్రపంచ కప్ వాయిదా పడడంతో కుటుంబాన్ని పోషించుకునే దారి లేక ఊబర్ ఈట్స్‌లో ఫుడ్ డెలివరీ చేసినట్లు వెల్లడి చేశారు. నిత్యావసరాలు, ఆహారం, ఇంటి అద్దెలను చెల్లించడానికి అప్పట్లో క్రికెట్ ఆడలేక పోవడంతో స్నేహితుల ద్వారా ఫుడ్ డెలివరీ ఉద్యోగం సంపాదించానని తెలియజేశారు. క్రికెట్ నుండి ఎప్పుడు పిలుపు వస్తే అప్పుడు వెళ్లడానికి రెడీగా ఇలాంటి ఉద్యోగంలో చేరవలసి వచ్చిందని వాన్ మీకెరన్ వ్యాఖ్యానించారు. వాన్ సౌతాఫ్రికాతో జరిగిన మ్యాచ్‌లో రెండు కీలక వికెట్లను పడగొట్టి జట్టు విజయానికి కారణమయ్యారు.