Home Page SliderNational

ధోని నా క్రికెట్ దేవుడు: SS తమన్

Share with

టీమిండియా మాజీ కెప్టెన్ మహేంద్ర సింగ్ ధోనికి ప్రపంచవ్యాప్తంగా అభిమానులున్న విషయం తెలిసిందే. అయితే వారిలో నేను కూడా ఒకడినే అంటున్నారు టాలీవుడ్ టాప్ మ్యూజిక్ డైరెక్టర్ SS తమన్. తాజాగా ధోనితో కలిసి దిగిన ఫోటోను తమన్ షేర్ చేస్తూ..ట్వీట్ చేశారు. నా వాడు.నా క్రికెట్ దేవుడు.మా MS ధోనిని కలవడంతో నా కల నెరవేరింది. నా హృదయం ఆనందంతో గంతులేస్తుంది. థ్యాంకు మై డియర్ ధోని..బిలియన్ల కొద్దీ మీ అభిమానుల్లో నేను ఒకడిని అని అన్నారు. అయితే ఈ విధంగా ధోనిని కలిసే అవకాశం కల్పించి నన్ను హ్యాపీ చేసినందుకు..సీఎం స్టాలిన్ ,మంత్రి ఉదయనిధి గారికి ధన్యవాదాలు అని SS తమన్ ట్వీట్ చేశారు.