Home Page SliderNational

“ధోనిని ద్వేషించేవారు క్రూరులు”: హార్థిక్ పాండ్యా

Share with

ఈ IPL సీజన్‌లో నాలుగు జట్టులు CSK,GT,LSG,MI ప్లేఆఫ్స్‌కు చేరుకున్న విషయం తెలిసిందే. కాగా ఈ రోజు ఈ IPL సీజన్‌లో తొలి  క్వాలిఫయింగ్ రౌండ్ జరగనుంది. అయితే ఈ క్నాలిఫయింగ్ రౌండ్ CSK VS GT మధ్య జరగనుంది. ఈ నేపథ్యంలో “కెప్టెన్..లీడర్..లెజెండ్ ధోని ఈజ్ యాన్ ఎమోషన్” అని  GT టీమ్ ఓ స్పెషల్ వీడియోను ట్విటర్‌లో పోస్ట్ చేసింది. కాగా ఈ వీడియోలో GT కెప్టెన్ హార్థిక్ పాండ్యా ధోనీపై ప్రశంసల వర్షం కురిపిస్తూ..నేను ఎప్పుడూ ధోని అభిమానినే అని స్పష్టం చేశాడు. అంతేకాకుండా ఈ వీడియోలో  ధోని గురించి మాట్లాడుతూ ధోని ఎప్పుడూ సీరియస్‌గా ఉంటాడని అందరు అనుకుంటారు. నేనైతే మహితో చాలా సరదాగా ఉంటాను. జోకులు వేస్తాను.ఎప్పుడూ అతన్ని ధోనీలా చూడను అని అన్నాడు. నేను ధోని నుంచి చాలా నేర్చుకున్నాను. అతడితో ఎక్కువగా మాట్లాడకపోయినా..కేవలం చూస్తునే చాలా సానుకూల అంశాలు నేర్చుకున్నానన్నారు. నాకైతో మహీ బెస్ట్ ఫ్రెండ్,ప్రియమైన సోదరుడన్నారు. అతడితో చిలిపి పనులు చేసేవాడినని తెలిపారు. ఇక నేను ఎప్పటికీ ధోని అభిమానినే.ధోనిని ఎవరైనా ద్వేషించారంటే వారు క్రూరులై ఉండాలి అని హర్థిక్ సరదాగా వ్యాఖ్యానించారు.