Home Page SliderNational

ఢిల్లీలో ధోని క్రేజ్ మామూలుగా లేదుగా..!

Share with

 ఈ ఐపీఎల్ సీజన్ త్వరలోనే ముగియనుంది. దీంతో ఇప్పటికే ప్లేఆఫ్స్‌కు చేరుకోని టీమ్స్ ఇంటికి పయనమయ్యారు. కాగా ప్లేఆఫ్స్‌ అవకాశాలను మెరుగుపరుచుకునేందుకు మరికొన్ని జట్టులు పోటి పడుతున్నాయి. ఇవాళ ఢిల్లీతో చెన్నై టీమ్ తలపడనుంది. ఈ మేరకు రెండు జట్టుల ప్లేయర్స్ ఢిల్లీ చేరుకున్నారు. ఈ నేపథ్యంలో ధోని ఫ్యాన్స్ ఢిల్లీలో హల్‌చల్ చేశారు.  హోటల్ నుంచి స్టేడియానికి వెళ్తున్న CSK బస్సు వెంట వేలాదిగా ధోని అభిమానులు పరుగులు పెట్టారు. అంతేకాకుండా  ధోనితో ఫోటోలు తీసుకునేందుకు ఎగబడ్డారు. కాగా వీరంతా 7వ నెంబర్ జెర్సీ ధరించి ధోనీ..ధోనీ అంటూ కేకలు వేశారు. ఈ క్రమంలో ఈ ప్రాంతంలో కొంచెంసేపు ట్రాఫిక్ జామ్ అయ్యింది. ధోనీ దేశంలో ఏ మూలకు వెళ్లినా ఆయన క్రేజ్ ఇలానే ఉంటుందని ఫ్యాన్స్ వీడియోలు షేర్ చేస్తున్నారు. మరికొందరు ఇదంతా ధోనీ మేనియా అని సోషల్ మీడియాలో కామెంట్స్ పెడుతున్నారు.