Home Page SliderTelangana

ఉగ్రవాద కోణంలో హైదరాబాద్‌లో డెంటల్ డాక్టర్‌ అరెస్ట్

Share with

ఉగ్రవాదిగా అనుమానిస్తూ సల్మాన్ అనే డెంటల్ డాక్టర్‌ను కూడా అరెస్ట్ చేశారు పోలీసులు. ఇస్లాం ఉగ్రవాదులుగా నిన్న 16 మందిని అరెస్ట్ చేసిన సంగతి తెలిసిందే. మధ్యప్రదేశ్, తెలంగాణా పోలీసులు యాంటీ టెర్రరిస్ట్ స్వాడ్ జాయింట్ ఆపరేషన్‌లో అరెస్టు చేసారు. వారివద్ద కత్తులు, మొబైల్స్, లాప్‌టాప్‌లు, జిహాదీ సాహిత్యం ఉన్న పుస్తకాలను స్వాధీనం చేసుకున్నారు. ఈరోజు ముస్లిం డెంటల్ డాక్టర్‌ను ఉగ్రవాదిగా అనుమానిస్తూ అరెస్టు చేశారు. ఈ సందర్భంగా అతని భార్య ఒక ఎన్జీవో సంస్థతో మాట్లాడుతూ తాము ఉగ్రవాదులు కారని, కేవలం ఆసక్తితో  ఇస్లాంకు సంబంధించిన కొన్ని పుస్తకాలు చదివామని, ఆడియోలు వింటామని తెలియజేసారు. తన భర్తను పోలీసులు చాలా ప్రశ్నలు అడిగారని, తమ పిల్లల బొమ్మలలో తుపాకీ బొమ్మలను స్వాధీనం చేసుకున్నారని పేర్కొన్నారు. అన్యాయంగా సరైన ఆధారాలు లేకుండా తన భర్తపై నేరం ఆరోపిస్తున్నారని విమర్శించారు. తాము ఉగ్రవాదులు కాదని, ఉగ్రవాదులుగా మారడం అంత తేలిక కాదని, తమ బంధువులు, తల్లిదండ్రులను వదులుకొని తాము అలా మారలేమని, కేవలం ఇస్లాంను అనుసరిస్తున్నామని తెలియజేశారు. తమకు ఎలాంటి ఉగ్రవాదులతో సంబంధాలు లేవని తెలియజేశారు.