Home Page SliderNational

పెను తుపాన్‌కు మోచా… బెంగాల్ హై అలర్ట్

Share with

కలవరపెడుతున్న మోచా తుపాన్
తీవ్ర తుపానుగా రూపాంతరం
బెంగాల్‌ను అలర్ట్ చేసిన వాతావరణ కేంద్రం
ఈశాన్య రాష్ట్రాలు, నికోబార్ దీవులకు హెచ్చరికలు

మోచా తుఫాను ఆగ్నేయ, మధ్య బంగాళాఖాతం పరిసర ప్రాంతాలపై తీవ్ర తుఫానుగా మారిందని అధికారులు తెలిపారు. నేషనల్ డిజాస్టర్ రెస్పాన్స్ ఫోర్స్ (NDRF) పశ్చిమ బెంగాల్‌లో ఎనిమిది బృందాలుగా ఏర్పడి 200 బలగాలను మోహరించింది. ఇండియన్ కోస్ట్ గార్డ్ (ICG) కూడా యూనిట్లను హై అలర్ట్‌లో ఉంచింది. “మేము ఈ ప్రాంతంలో ఎనిమిది బృందాలను, 200 మంది భద్రతాదళాలను నియమించాం, 100 మంది తుపాను సమయంలో ప్రజలను కాపాడేందుకు సిద్ధంగా ఉన్నారు” అని NDRF 2వ బెటాలియన్ కమాండెంట్ గుర్మీందర్ సింగ్ తెలిపారు.

తుఫానును నిశితంగా పరిశీలిస్తున్న భారత వాతావరణ విభాగం (IMD) ఆదివారం నాటికి తుఫాను క్రమంగా తీవ్ర తుఫానుగా మారుతుందని తెలిపింది. బంగ్లాదేశ్-మయన్మార్ సరిహద్దులో విరుచుకుపడుతుందని, గంటకు 145 కి.మీ వేగంతో గాలులు వీస్తాయని పేర్కొంది. కాక్స్ బజార్ సమీపంలో బంగ్లాదేశ్‌లోని లోతట్టు తీర ప్రాంతంలో 1.5-2 మీటర్ల సముద్రం ముందుకు వస్తోందని IMD అంచనా వేసింది.

మత్స్యకారులు, ప్రయాణికులు ఆదివారం వరకు మధ్య, ఈశాన్య బంగాళాఖాతం, ఉత్తర అండమాన్ సముద్రంలోకి వెళ్లవద్దని వాతావరణ కార్యాలయం హెచ్చరించింది. ప్రకృతి వైపరీత్యాన్ని సమర్థవంతంగా ఎదుర్కొనేందుకు అత్యవసర ఆపరేషన్ కేంద్రాలు 24 గంటలు పనిచేస్తున్నాయని అధికారులు తెలిపారు. వాతావరణ వ్యవస్థ ప్రభావంతో కొన్ని ఈశాన్య రాష్ట్రాలు, అండమాన్ మరియు నికోబార్ దీవులకు వర్ష హెచ్చరికలు జారీ చేయబడ్డాయి.


త్రిపుర, మిజోరంలలో రేపు భారీ వర్షాలు పడే అవకాశం ఉంది. నాగాలాండ్, మణిపూర్, దక్షిణ అస్సాంలలో కూడా ఆదివారం వర్షాలు కురుస్తాయని IMD తెలిపింది. కాఫీ ఉత్పత్తికి ప్రసిద్ధి చెందిన దేశంలోని ఒక చిన్న మత్స్యకార గ్రామం ఆధారంగా యెమెన్ ‘మోచా’ అనే పేరును తుపానుకు సూచించింది.