Home Page SliderInternational

అల్లకల్లోలంగా అరేబియా తీరం-ముంచుకొస్తున్న బిపర్‌జాయ్ తుఫాన్

Share with

ప్రశాంతంగా ఉండే అరేబియా సముద్రం అల్లకల్లోలంగా మారింది. బిపర్‌జోయ్ తుఫాన్ తీరప్రాంతాలను ముంచెత్తుతోంది. గుజరాత్, ముంబై, కేరళ,  పాకిస్థాన్‌లలో బీభత్సం సృష్టిస్తోంది. మహారాష్ట్రలో గంటకు 170-180 కిలోమీటర్ల వేగంతో గాలులు వీస్తున్నాయి. సముద్రతీరాలలో రాకాసి అలలు ఎగిసి పడుతున్నాయి. ఈ ప్రాంతాలలో సందర్శన యోగ్యమైన బీచ్ ప్రాంతాలను మూసివేశారు. గుజరాత్‌లో తుఫాన్‌ పరిస్థితిపై ప్రధాని మోదీ సమీక్ష నిర్వహించారు. ఈ తుఫాన్‌పై ముందస్తు జాగ్రత్తల గురించి, సహాయక చర్యల గురించి ఆదేశించారు. ఈ తుఫాన్ ఉత్తర ఈశాన్య దిక్కుగా కొనసాగుతోంది. కర్ణాటకలో కూడా వర్ష బీభత్సం కొనసాగుతోంది.

పాకిస్థాన్ వద్ద ఈ తుఫాన్ తీరం దాటుతుందని అంచనాలు వేస్తున్నారు. మత్సకారులకు సముద్రంలోకి వెళ్లొద్దని హెచ్చరికలు జారీ చేశారు. అటు పాకిస్తాన్‌లో కూడా తుఫాన్ వర్షబీభత్సం కొనసాగుతోంది. అక్కడి ప్రధాని షరీఫ్ కూడా సమీక్ష నిర్వహించారు. పాకిస్తాన్‌లో గత ఏడాది వరదల నుండే ఇంకా కోలుకోని పాకిస్థాన్ ఈ బిఫర్‌జోయ్ దెబ్బకు కుదేలవుతోంది. అక్కడ ఉరుములు మెరుపులతో ఎడతెరిపి లేకుండా వర్షం పడుతోంది. 150 మందికి గాయాలు, 34 మరణాలతో పాకిస్థాన్ పరిస్థితి దారుణంగా ఉంది. దేశవ్యాప్తంగా 80 వేల మందిని సురక్షిత ప్రాంతాలకు తరలించారు. రెస్క్యూ ఆపరేషన్‌ను కొనసాగిస్తున్నారు.