BusinessHome Page Slider

మేకపాల ఐస్‌క్రీమ్‌తో  కోట్ల టర్నోవర్

Share with

ఇద్దరు స్నేహితుల బిజినెస్ ఐడియా వారి జీవితాన్నే మార్చేసింది. ఆరేళ్ల క్రితం కన్వర్ ప్రీత్, మన్మీత్ సింగ్ అనే ఇద్దరు ఢిల్లీకి చెందిన చిన్ననాటి స్నేహితులు పెట్టిన స్టార్టప్ కంపెనీయే ఈ మేకపాల ఐస్ క్రీమ్ తయారీ. వారు మొదటి నుండీ ఎన్నో వ్యాపారాలు కలిసి చేశారు. అలా 2016లో యూరప్ ట్రిప్‌లో చూసిన మేకపాల ఐస్ క్రీమ్ బిజినెస్‌ను ఇండియాలో కూడా చేస్తే బాగుంటుందని ఈ వ్యాపారం ప్రారంభించారు. ఈ వ్యాపారం ఒక స్టోర్‌తో మొదలై, ప్రస్తుతం 50 స్టోర్లుకు విస్తరించింది. ఢిల్లీ, చంఢీగడ్, ముంబైకి కూడా తమ వ్యాపారాన్ని పెంచుకున్నారు. ఎయిర్ ఇండియా కార్గో సేవలు ఉపయోగించుకుని విదేశాలకు కూడా విస్తరించారు. మూడు రోజులకు మించి వీరు ఐస్ క్రీమ్‌ను ఉండకుండా జాగ్రత్త పడతారు. ఎప్పటికప్పుడు తాజాగా తయారుచేస్తారు. వీరి లాభం వింటే కళ్లు చెదిరిపోతాయి. రోజుకు 10 లక్షలకు మించి సంపాదిస్తూ ఏడాదికి 36 కోట్ల టర్నోవర్‌ను సాధిస్తున్నారు. వీరి ఐస్ క్రీమ్ దాదాపు 45 ఫ్లేవర్స్‌లో లభిస్తుంది.