Home Page SliderNational

రాహుల్ గాంధీ 2 ఏళ్ల జైలు శిక్షను నిలుపుదల చేసిన కోర్టు

Share with

2019 పరువు నష్టం కేసులో దోషిగా నిర్ధారించడాన్ని సవాలు చేసిన రాహుల్
మే 3న సూరత్ జిల్లా, సెషన్స్ కోర్టులో కేసు విచారణ
ఏప్రిల్ 13 వరకు రాహుల్ బెయిల్ పొడిగించిన కోర్టు

2019 పరువు నష్టం కేసులో రాహుల్ గాంధీని దోషిగా నిర్ధారించడాన్ని సవాలు చేసిన కేసులో తదుపరి విచారణ మే 3న సూరత్ జిల్లా సెషన్స్ కోర్టులో జరగనుంది. అప్పీలుపై తీర్పు వచ్చే వరకు రెండేళ్ల జైలుశిక్ష ను కోర్టు సస్పెండ్ చేసింది. రాహుల్ బెయిల్‌ను ఏప్రిల్ 13 వరకు కోర్టు పొడిగించింది. పరువునష్టం కేసులో శిక్షపై ఆయన చేసిన అప్పీల్‌ను కోర్టు ఏప్రిల్ 13న విచారించనుంది. సూరత్ కోర్టు తీర్పు తర్వాత రాహుల్ గాంధీపై లోక్ సభ అనర్హత వేటు వేసింది. మాజీ కాంగ్రెస్ అధ్యక్షుడు, తన లోక్‌సభ సభ్యత్వాన్ని కూడా పునరుద్ధరించే నేరారోపణపై మధ్యంతర స్టే విధించాలని అభ్యర్థించినట్టు తెలుస్తోంది. రాహుల్ గాంధీతో పాటు ఆయన సోదరి ప్రియాంక గాంధీ వాద్రా కూడా వెంట ఉన్నారు.

చీఫ్ జ్యుడీషియల్ మేజిస్ట్రేట్ తీర్పును సవాల్ చేస్తూ రాహుల్ గాంధీ లీగల్ టీమ్ సూరత్ సెషన్స్ కోర్టులో అప్పీలు చేసింది. అప్పీల్‌తో పాటు రాహుల్ గాంధీ కోర్టులో రెండు దరఖాస్తులు దాఖలు చేశారు. నేరారోపణపై స్టే కోరుతూ దరఖాస్తు, సస్పెన్షన్ ఆఫ్ సెంటెన్స్ కోరుతూ దరఖాస్తు… శిక్షపై స్టేకు సంబంధించి మొదటి దరఖాస్తును అనుమతిస్తే, రాహుల్ గాంధీ లోక్‌సభ సభ్యత్వాన్ని పునరుద్ధరించేందుకు అవకాశం ఉంటుంది. మూడు రాష్ట్రాల కాంగ్రెస్ పాలిత ముఖ్యమంత్రులు – అశోక్ గెహ్లాట్, భూపేష్ బాఘేల్, సుఖ్విందర్ సింగ్ సుఖూ కూడా గాంధీకి నైతిక మద్దతుగా గుజరాత్‌ వచ్చారు. రాహుల్ గాంధీ, సోదరితోపాటు కొంతమంది పార్టీ నేతలతో కలిసి సూరత్‌ కోర్టుకు వెళ్లడం న్యాయవ్యవస్థపై ఒత్తిడి తెచ్చే చిన్న పిల్లల చర్యగా బీజేపీ అభివర్ణించింది.