Andhra PradeshHome Page Slider

భాస్కర్‌రెడ్డికి బెయిల్ నిరాకరణ

Share with

వివేకా హత్యకేసులో నిందితుడిగా ఉన్న భాస్కర్ రెడ్డి బెయిల్ పిటిషన్‌పై వాదనలు ముగిసాయి. సీబీఐ వాదనతో ఏకీభవిస్తూ భాస్కర రెడ్డి బెయిల్‌ను నిరాకరిస్తూ పిటిషన్‌ను కొట్టివేసింది కోర్టు. బెయిల్ కావాలని కోరుతూ సీబీఐ కోర్టులో పిటిషన్ దాఖలు చేశారు వైఎస్ భాస్కర్ రెడ్డి. ఈ కేసులో బలమైన నిందితుడైన భాస్కర్ రెడ్డి బయట ఉంటే సాక్ష్యులెవ్వరూ ముందుకు రారని, సీబీఐ అధికారులు వాదించారు. దీనితో వారి వాదనలతో ఏకీభవిస్తూ భాస్కర రెడ్డికి బెయిల్ నిరాకరించారు. ఇదే కేసులో ఆరోపణలు ఎదుర్కొంటూ ముందస్తు బెయిల్‍‌పై ఉన్న అవినాశ్ రెడ్డి తండ్రే ఈ భాస్కర్ రెడ్డి. హత్య కావించబడిన వివేకా కుమార్తె సునీత , అఫ్రూవర్‌గా మారిన ఎర్రగంగిరెడ్డి వాగ్మూలాల ప్రకారం సీబీఐ అధికారులు భాస్కరరెడ్డి పాత్ర ఈ కేసులో బలంగా ఉందని భావిస్తున్నారు.