Home Page SliderInternational

‘కరోనా మహమ్మారి’, ‘న్యూక్లియర్ వార్’ లాంటివే “AI” టూల్స్- అదుపు చేయాల్సిన అవసరం ఉంది

Share with

కరోనా మహమ్మారి, న్యూక్లియర్ వార్ ఎంతటి ప్రమాదాన్ని తెస్తాయో ఇవి కూడా అంతే ప్రమాదమని వీటిని అరికట్టే చర్యలు తీసుకోవాలని చాలామంది డిమాండ్ చేస్తున్నారు. రాబోయే ఐదేళ్లలో మనుషులు ప్రోగ్రామ్‌లను డిజైన్ చేయవలసిన అవసరం లేదని స్టెబిలిటీ ఏఐ సీఈవో ఎమాడ్ మోస్టాక్ సంచలన వ్యాఖ్యలు చేశారు. టెక్ రంగానికి కావలసిన కోడ్‌లను ప్రామాణికంగా, ఖచ్చితంగా అందించేటందుకు సహాయపడే ఏఐ టూల్స్ అందుబాటులోకి వచ్చాయని, వాటితో స్వయంగా కోడింగ్ రూపొందించవచ్చని పేర్కొన్నారు. కనుక రాబోయే ఐదేళ్లలో ప్రోగ్రామర్ల అవసరం ఉండదన్నారు. బేసిక్ ప్రోగ్రామర్లకు ఉద్యోగ ముప్పు ఎక్కువగా ఉందన్నారు. 2024 నాటికి అందరి ఫోన్‌లలో చాట్ జీపీటీ అందుబాటులోకి రావచ్చని, పైగా దీనిని ఉపయోగించాలంటే ఇంటర్నెట్ కూడా అవసరం లేదని వెల్లడించారు. హెల్త్, సైన్స్ విషయాలకు కూడా ఏఐ టూల్స్ అందుబాటులో ఉంటాయని, దీనివల్ల వారి సామర్థ్యం, వేగం పెరుగుతాయన్నారు.

అయితే ఈ విషయంలో భిన్నాభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. మానవాళికి ఈ చాట్ జీపీటీ వంటి ఏఐ టూల్స్ వల్ల ఎంత లాభం ఉందో అంతకు మించి ముప్పు ఉందని టెస్లా, ట్విటర్ అధినేత మస్క్, ఆపిల్ అధినేత వంటివారు అభిప్రాయపడుతున్నారు. వీరే కాక అనేక కంపెనీల సీఈవోలు కూడా ఇదే అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు. ఈ వారంలో అమెరికన్ యేల్ యూనివర్సిటీ యేలో సీఈవో సమ్మిట్ నిర్వహించగా దీనిలో 42 శాతం మంది సీఈవోలు ఏఐ వల్ల ప్రమాదమేనని, అది వ్యక్తుల ప్రాధాన్యతను తగ్గిస్తుందని, వారి స్థానాలను ఆక్రమిస్తుందని పేర్కొన్నారు. రాబోయే ఐదేళ్లలో మనుషుల్ని నాశనం చేసే సామర్థ్యానికి అవి చేరతాయని వీరు పేర్కొన్నారు.