Home Page SliderNational

కరోనాకు, గుండెపోటుకు సంబంధం కనిపెడతాం

Share with

ఈ మధ్యకాలంలో మళ్లీ కరోనా కేసులు విజృంభిస్తున్నాయి. ఇప్పటి వరకూ 214 రకాల కొవిడ్ వేరియంట్లు ఉన్నట్లు గుర్తించారు. ఈ మధ్యకాలంలో చిన్నవయసు వారే గుండెపోటుకు గురికావడం, హఠాత్తుగా గుండె ఆగిపోయి చనిపోవడం వంటి సంఘటనలు జరుగుతున్నాయి. దీనితో కేంద్ర ఆరోగ్యమంత్రి మన్‌సుఖ్ మాండవీయ టీవీ ఇంటర్యూలో పలు ఆసక్తికర అంశాలను ప్రస్తావించారు. మూడు,నాలుగు నెలల నుండి దీనిపై పరిశోధనలు మొదలయ్యాయని, దేశంలోని విసృతంగా చేపట్టిన వ్యాక్సినేషన్ వల్ల తమ వద్ద ఎంతో సమాచారం ఉందని, దీనిద్వారా భారత వైద్యపరిశోధన మండలి(ఐసిఎమ్‌ఆర్) పరిశోధనలు చేస్తోందని తెలిపారు. త్వరలోనే కొవిడ్‌కు, గుండెపోటుకు గల సంబంధాన్ని కనుక్కుంటామన్నారు. కొత్త వేరియంట్లను కూడా ల్యాబ్‌లో పరీక్షించి వాటిపై వ్యాక్సిన్ల పనితీరు గమనిస్తున్నామన్నారు. ఇప్పటి వరకూ వ్యాప్తిలో ఉన్న అన్ని కొవిడ్ వేరియంట్లపై వ్యాక్సిన్లు సమర్థవంతంగా పనిచేస్తున్నట్లు రుజువయ్యింది. ప్రస్తుతం బీఎఫ్.7 , ఎక్స్ బీబీ 16 అనే వేరియంట్ వ్యాప్తిలో ఉందన్నారు.