Home Page SliderTelangana

కస్తూర్భా విద్యాలయంలో కలుషితాహారం -70మందికి అనారోగ్యం

Share with

కస్తూర్భా విద్యాలయంలోని విద్యార్థినులు కలుషితాహారం తిని తీవ్ర అనారోగ్యానికి గురయ్యారు. ఈ ఘటన తెలంగాణలోని వనపర్తి జిల్లా అమరచింత కస్తూర్భా విద్యాలయంలో చోటుచేసుకుంది. గురువారం రాత్రి భోజనం తర్వాత విద్యార్థినులు తీవ్ర కడుపునొప్పితో విలవిలలాడారు. రాత్రి వంకాయ, సాంబారు తిన్న విద్యార్థినులు 11 గంటల ప్రాంతంలో కడుపునొప్పి అని సిబ్బందికి తెలియజేశారు. అయితే వాచ్‌మెన్‌తో పాటు ఒక్క టీచర్ మాత్రమే ఉండడంతో వారిని బయటకు పంపలేదన్నారు. రాత్రంతా వారు అస్వస్తతతో బాధపడుతూనే ఉన్నారు. తెల్లవారు జామున ఆటోలో వారిని సమీపంలోని ఆత్మకూరు ప్రభుత్వాసుపత్రికి తీసుకెళ్లారు. అందరికీ కాస్త నెమ్మదించినా నలుగురు విద్యార్థినులకు తగ్గలేదు. దీనితో వారిని వనపర్తి జిల్లా ఆసుపత్రికి తరలించే ఏర్పాట్లు చేస్తున్నారు. దీనితో విషయం తెలుసుకున్న తల్లిదండ్రులు ఆందోళనకు గురయ్యారు. ఆసుపత్రికి తరలి వస్తున్నారు. ఆహారంలో కలుషితమయ్యిందా అనే విషయంపై ఆరా తీస్తున్నారు. మొత్తంగా 70 మంది విద్యార్థినులు అనారోగ్యానికి గురైనట్లు సమాచారం. వీరంతా 9వ తరగతి నుండి ఇంటర్ వరకూ చదువుకునే విద్యార్థినులే.