Andhra PradeshHome Page Slider

హిందూ విశ్వాసాలను పరిరక్షించేందుకు 3 వేల ఆలయాల నిర్మాణం- మంత్రి కొట్టు సత్యనారాయణ

Share with

ఆంధ్రప్రదేశ్‌లోని ప్రతి జిల్లాకు ఒక దేవాలయం ఉండేలా… రాష్ట్ర వ్యాప్తంగా దేవాలయాల నిర్మాణాన్ని ప్రభుత్వం పెద్దఎత్తున చేపడుతోందన్నారు ఏపీ డిప్యూటీ సీఎం, దేవాదాయ శాఖ మంత్రి కొట్టు సత్యనారాయణ. ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి ఆదేశాల మేరకు హిందువుల విశ్వాసాన్ని కాపాడేందుకు, ప్రచారం చేసేందుకు ఈ కార్యక్రమం చేపట్టామన్నారు. హిందూ విశ్వాసాన్ని రక్షించడానికి, ప్రచారం చేయడానికి, బలహీన వర్గాల ప్రాంతాల్లో హిందూ దేవాలయాల నిర్మాణాన్ని ప్రారంభించడం జరిగిందని దేవాదాయ శాఖ మంత్రి సత్యనారాయణ తెలిపారు.

తిరుమల తిరుపతి దేవస్థానం శ్రీ వాణి ట్రస్ట్ నుంచి, ఒక్కొక్క ఆలయ నిర్మాణానికి ₹ 10 లక్షలు కేటాయిస్తోందన్నారు. 1,330 ఆలయాల నిర్మాణ ప్రారంభంతో పాటు, మరో 1,465 ఈ జాబితాలోకి చేర్చామన్నారు. అదేవిధంగా కొంతమంది ఎమ్మెల్యేల విజ్ఞప్తితో మరో 200 ఆలయాలను నిర్మించాలని నిర్ణయించామన్నారు. మిగిలిన ఆలయాల నిర్మాణం ఇతర స్వచ్ఛంద సంస్థల సహకారంతో జరుగుతోందని తెలిపారు.

దేవాదాయ శాఖ ఆధ్వర్యంలో 978 ఆలయాల నిర్మాణాలు శరవేగంగా జరుగుతున్నాయని, ప్రతి 25 ఆలయాల పనులను ఒక అసిస్టెంట్ ఇంజనీర్‌కు అప్పగించినట్లు మంత్రి తెలిపారు. కొన్ని దేవాలయాల పునరుద్ధరణకు, ఆలయాలలో పూజల నిర్వహణకు కేటాయించిన ₹ 270 కోట్ల CGF నిధులలో ₹ 238 కోట్ల నిధులు విడుదలచేశామన్నారు. అదేవిధంగా, ఆలయానికి ₹ 5,000 చొప్పున దూప దీప నైవేద్యం కింద ఆర్థిక సహాయం కోసం ఈ ఆర్థిక సంవత్సరంలో కేటాయించిన ₹ 28 కోట్లలో ₹ 15 కోట్లు ఖర్చు చేశామన్నారు. “దూప దీప పథకం కింద, 2019 నాటికి కేవలం 1,561 దేవాలయాలు మాత్రమే నమోదు చేస్తే… ఇప్పుడు 5,000కి విస్తరించాయన్నారు మంత్రి సత్యనారాయణ.