Andhra PradeshHome Page Slider

నా చాప్టర్ క్లోజ్ చేయడానికి కుట్ర: ఏసీబీ కోర్టు జడ్జీకి చంద్రబాబు లేఖ

Share with

విజయవాడ: ఏసీబీ కోర్టు జడ్జికి తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబు లేఖ రాశారు. తన భద్రత, ఆరోగ్యంపై అనుమానాలు వ్యక్తం చేస్తూ ఆయన మూడు పేజీల లేఖ రాశారు. ఈ నెల 25న రాసిన లేఖను జైలు అధికారుల ద్వారా జడ్జికి పంపారు.

నేను జైలుకు వచ్చినప్పుడు అనధికారికంగా వీడియోలు, ఫొటోలు తీశారు. నా ప్రతిష్ఠను దెబ్బతీసేందుకే ఈ తరహా వీడియో ఫుటేజ్ రిలీజైంది. నన్ను అంతంచేసేందుకు వామపక్ష తీవ్రవాదాలు కూడా కుట్రలు చేస్తున్నారు. కుట్రపై తూర్పు గోదావరి జిల్లా ఎస్పీకి లేఖ రాసి పంపాను. ఆ లేఖపై స్పందన లేదు.

కొంతమంది ఖైదీలతో నా భద్రతకు పెద్ద ముప్పు ఏర్పడేలా ఉంది: జైలులో అనేక ఘటనలు జరుగుతున్నాయి. కొందరు దుర్మార్గులు జైలులోకి గంజాయి ప్యాకెట్లు విసిరారు. తోటలో ఉన్న కొంతమంది ఖైదీలు గంజాయిని పట్టుకున్నారు. ఖైదీల్లో 750 మంది తీవ్ర నేరాలకు పాల్పడినవారున్నారు. కొంతమంది ఖైదీల వల్ల నా భద్రతకు తీవ్ర ముప్పు పొంచి ఉంది. ఈ నెల 6న జైలు ప్రధాన ద్వారం మీదుగా డ్రోన్ కెమేరా తిరిగింది. ములాఖత్‌లో నన్ను కలిశాక వారి చిత్రాల కోసం డ్రోన్ తిప్పుతున్నారు. నాతోపాటు నా కుటుంబసభ్యులకు కూడా ప్రమాదం పొంచి ఉంది అని చంద్రబాబు తన లేఖలో ప్రస్తావించారు.