Home Page SliderTelangana

తెలంగాణాలో కాంగ్రెస్ తుఫాన్ రాబోతుంది:రాహుల్ గాంధీ

Share with

తెలంగాణా అసెంబ్లీ ఎన్నికలు త్వరలోనే జరగనున్నాయి. ఈ నేపథ్యంలో కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ తెలంగాణాలో ఎన్నికల ప్రచారాన్ని ప్రారంభించారు. ఈ మేరకు ఆయన ఈ రోజు తెలంగాణాలోని పెద్దపల్లిలో పర్యటించారు. కాగా పెద్దపల్లిలో ఏర్పాటు చేసిన కాంగ్రెస విజయభేరి సభలో రాహుల్ పాల్గొన్నారు.ఈ సందర్భంగా రాహుల్ మాట్లాడుతూ..వచ్చే ఎన్నికల్లో తెలంగాణాలో కాంగ్రెస్ తుఫాన్ రాబోతుందన్నారు. గత 10 ఏళ్ల నుంచి తెలంగాణాలో కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలను అణచివేశారన్నారు. రాష్ట్రంలో కాంగ్రెస్ కార్యకర్తలే మా పులులు..వచ్చేది మా ప్రభుత్వమే అని రాహుల్ కాంగ్రెస్ పార్టీ గెలుపుపై ధీమా వ్యక్తం చేశారు. తెలంగాణాలో కులగణన గురించి తాను లోక్ సభలో మాట్లాడానని రాహుల్ తెలిపారు. ప్రధాని మోదీ ,కేసీఆర్ ఎప్పుడు ఓబీసీల గురించే మాట్లాడతారన్నారు. కాగా కులగణన డేటా  గురించి ఎందుకు బయటపెట్టరని లోక్‌సభలో మోదీని ప్రశ్నించాను అన్నారు. తెలంగాణాలో రైతు రుణమాఫీ,డబుల్ బెడ్‌రూమ్ ఇళ్లు ఎంతమందికి వచ్చాయని రాహుల్ ప్రశ్నించారు. తెలంగాణాలో ధరణి పోర్టల్‌తో మాయ చేసి నిరుపేదల భూముల్ని కేసీఆర్ లాక్కున్నారని రాహుల్ ఆరోపించారు. సీఎం కేసీఆర్ రాష్ట్రంలోని భూస్వాములకే రైతు బంధు అందిస్తున్నారు. కానీ తక్కువ ఎకరాలు ఉన్న రైతులకు రైతు బంధు అందించడం లేదని రాహుల్ గాంధీ విమర్శించారు.