Home Page SliderNational

లోక్‌సభలో గందరగోళం

Share with

లోక్‌సభలో గందరగోళ వాతావరణం నెలకొంది. కాగా ఇటీవల లోక్‌సభలో జరిగిన కలర్ స్మోక్ ఘటనపై విపక్షాలు ఈరోజు సభ ఆరంభంలోనే ఆందోళన చేపట్టాయి. లోక్‌సభలో భద్రతా వైఫల్యంపై విపక్షాల సభ్యులు నిరసనకు దిగారు.వారు కలర్‌స్మోక్ ఘటనపై హోంమంత్రి సమాధానం చెప్పాలని డిమాండ్ చేశారు. కాగా ఈ ఘటనపై ఎంపీ ప్రతాపసింహ సమాధానం చెప్పాలని వారంతా సభలో నినాదాలు చేశారు. అయితే సభా కార్యక్రమాలను అడ్డుకోవడం సరికాదని స్పీకర్ సభ్యులందరికీ విన్నవించారు. సభ సజావుగా సాగేందుకు సభ్యులంతా సహకరించాలని స్పీకర్ కోరారు. మరోవైపు రాజ్యసభలోనూ ఇదే పరిస్థితి నెలకొంది. దీంతో స్పీకర్ రాజ్యసభను 11.30 వరకు వాయిదా వేశారు. ఇటీవల లోక్‌సభలోకి ఆగంతకులు ప్రవేశించి కలర్‌స్మోక్‌ను ప్రయోగించడం దేశవ్యాప్తంగా తీవ్ర చర్చనీయాంశమైంది. ఈ మేరకు లోక్‌సభలో భద్రతా వైఫల్యంపై సర్వత్రా విమర్శలు వెల్లువెత్తుతున్నాయి.