Home Page SliderNational

ఎన్డీయే కూటమిలో కలకలం..నితీష్ కుమార్ డిమాండ్స్

Share with

కేంద్రంలోని ఎన్డీయే కూటమిలోని  మోదీ సర్కారుకు షాక్ తగిలింది. ప్రభుత్వం ఏర్పడి పట్టుమని పదిరోజులైనా కాకముందే బీహార్ ముఖ్యమంత్రి నితీష్ కుమార్ డిమాండ్స్ మొదలుపెట్టారు. బీహార్‌కు ప్రత్యేక హోదా అంశాన్ని లేవనెత్తారు. ఈ అంశంపై పార్టీ సమావేశంలో తీర్మానాలు జరిగాయి. జనతాదళ్ జాతీయ కార్యవర్గ సమావేశం నేడు (శనివారం) జరిగింది. దీనిలో బీహార్‌కు ప్రత్యేక హోదా లేదా ఆర్థిక ప్యాకేజిని ఇవ్వాలని డిమాండ్ చేస్తూ తీర్మానం చేశారు. ఈ విషయంపై జేడీయూ నేత మాట్లాడుతూ ఈ అంశం ఎప్పడినుండో పెండింగులో ఉందని, కొత్తదేమీ కాదన్నారు. రాష్ట్రాన్ని అభివృద్ధి పథంలో నడిపించడానికి, సవాళ్లను పరిష్కరించడానికి ప్రత్యేక హోదా లేదా ప్యాకేజి అవసరం అన్నారు. ఇదే సమావేశంలో నీట్ ప్రశ్నాపత్రాల లీకేజి విషయం కూడా తీర్మానం చేశారు. నిందితులకు కఠిన శిక్షలు విధించాలన్నారు. పరీక్షలలో అక్రమాలను నివారించేందుకు పార్లమెంటులో ప్రత్యేక చట్టం చేయాలని కోరారు. ఈ సమావేశంలో పార్టీ జాతీయ కార్యవర్గ అధ్యక్షునిగా సంజ్‌ఝూను ఎన్నిక చేశారు. ఒకవేళ ఇది సాధ్యమైతే, కూటమిలో భాగస్వామ్యం ఉన్న తెలుగుదేశం పార్టీ కూడా ప్రత్యేక హోదా అంశాన్ని లేవనెత్తుతుందా అనే సందేహాలు వ్యక్తమవుతున్నాయి.