Home Page SliderNational

తమిళనాడులో గృహిణులకు సీఎం స్టాలిన్ కొత్త పథకం

Share with

తమిళనాడు సీఎం స్టాలిన్ రాష్ట్రంలో మరో కొత్త పథకాన్ని ప్రారంభించనున్నారు. ఈ పథకం ద్వారా తమిళనాడులోని గృహిణులకు లబ్ది చేకూరబోతుంది.ఈ పథకం ద్వారా తమిళనాడులోని గృహిణులకు  ప్రతి నెలా రూ.1000 అందించనున్నట్లు సీఎం స్టాలిన్ ప్రకటించారు. అయితే దీనికి ఎంతో పకడ్భందీగా లబ్దిదారులను ఎంపిక చేయాలని సీఎం జిల్లా కలెక్టర్లను ఆదేశించినట్లు తెలుస్తోంది. కాగా తమిళనాడులో డీఎంకే పార్టీ ఫౌండర్ అన్నాదురై జయంతి సందర్భంగా సెప్టెంబర్ 15 నుంచి పథకాన్ని ప్రారంభిస్తామని సీఎం తెలిపారు. అయితే 21 ఏళ్లు నిండి ఉండాలని పేర్కొన్నారు. అయితే ఈ పథకానికి కుటుంబ వార్షికాదాయం రూ.2,50,000లోపు ఉన్నవారే అర్హులని సీఎం స్టాలిన్ స్పష్టం చేశారు.