Home Page SliderTelangana

విద్యార్థులతో సీఎం రేవంత్‌రెడ్డి ముఖాముఖి

Share with

తెలంగాణాలోని ప్రభుత్వ పాఠశాలల్లో చదువుకొని 10వ తరగతిలో అత్యత్తమ ప్రతిభ కనబర్చిన విద్యార్థులకు వందేమాతరం ఫౌండేషన్ ఆధ్వర్యంలో ఇవాళ ప్రతిభా పురస్కారాలను అందించే కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా సీఎం రేవంత్ రెడ్డి హాజరయ్యారు. ఈ సందర్భంగా ఆయన విద్యార్థులతో మాట్లాడారు. దేశంలోని 90% మంది ఐఏఎస్‌లు,ఐపీఎస్‌లు ప్రభుత్వ పాఠశాలల్లోనే చదువుకుని గొప్ప స్థితికి చేరుకున్నారన్నారు. అంతేకాకుండా నిన్న భారతదేశ ప్రధానిగా మూడవసారి ప్రమాణ స్వీకారం చేసిన మోదీ,ఈ నెల 12వ తేదిన సీఎంగా ప్రమాణ స్వీకారం చేయనున్న చంద్రబాబు నాయుడు,గత సంవత్సరం డిసెంబర్ 7న సీఎంగా ప్రమాణ స్వీకారం చేసిన తాను కూడా ప్రభుత్వ పాఠశాలల్లోనే చదువుకున్నామని ఆయన తెలిపారు.తెలంగాణాలోని అన్ని ప్రభుత్వ పాఠశాలల్లో అభివృద్ది కోసం త్వరలోనే విద్యా కమీషన్ ఏర్పాటు చేస్తామన్నారు. పేదవారిని అభివృద్ది పథంలో నడిపించే శక్తి కేవలం విద్యకు మాత్రమే ఉందన్నారు. కాబట్టి విద్యార్థులంతా మంచిగా చదువుకుని గొప్ప స్థితికి చేరుకోవాలని సీఎం రేవంత్ రెడ్డి విద్యార్థులకు సూచించారు.