Home Page SliderTelangana

మేడిగడ్డపై సీఎం రేవంత్‌రెడ్డి ఆదేశాలు

Share with

కాళేశ్వరం ఎత్తిపోతల ప్రాజెక్టులో భాగమైన మేడిగడ్డపై సీఎం రేవంత్‌రెడ్డి సమీక్ష నిర్వహించారు. ఈ బ్యారేజి పిల్లర్లు కుంగుబాటుకు గురైన విషయానికి సంబంధించి పూర్తి సమాచారం తెలియజేయాలని నీటిపారుదల అధికారులను ఆదేశించారు. ఈ సమీక్షలో నీటిపారుదల మంత్రి ఉత్తమ్‌కుమార్ రెడ్డి, ఇంజనీర్లు పాల్గొన్నారు. గత ప్రభుత్వ హయాంలో నిర్మించిన ప్రాజెక్టులు, ఖర్చుల వివరాలను పూర్తిగా తెలియజేయాలని అధికారులను కోరారు. దీనితో పాటు కృష్ణా,గోదావరీ నదీజలాల విషయంలో ఇతర రాష్ట్రాలతో తెలంగాణాకు గల వివాదాలపై చర్చించారు. మేడిగడ్డ ప్రాజెక్టుపై జ్యుడిషియల్ విచారణ జరపాలని ప్రభుత్వం ఆలోచిస్తున్నట్లు సమాచారం. బ్యారేజికి సంబంధించి నిర్మాణ సంస్థ నీటిపారుదల శాఖకు రాసిన లేఖలపై న్యాయపరమైన చర్యలను ఇంజనీర్లను అడిగితెలుసుకున్నారు ముఖ్యమంత్రి. అంతేకాక రాష్ట్రంలో యాసంగి పంటకు నీరు అందించే విషయంలో మంత్రి అధ్వర్యంలో ఒక బృందాన్ని కర్ణాటకకు పంపాలని ఆలోచిస్తున్నారు. ఇప్పుడు కర్ణాటకలో కూడా కాంగ్రెస్ ప్రభుత్వం ఉండడంతో అక్కడ నుండి సహకారం లభిస్తుందని భావిస్తున్నారు.