Home Page SliderTelangana

టాలీవుడ్‌కి సీఎం రేవంత్ రెడ్డి షరతులు

Share with

తెలంగాణా సీఎం రేవంత్ రెడ్డి తెలుగు సినిమా ఇండస్ట్రీకి కీలక సూచనలు చేశారు. ఇటీవల కాలంలో తెలంగాణాలో డ్రగ్స్ కేసులు ఎక్కువగా నమోదవుతున్న విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో సీఎం రేవంత్ రెడ్డి సమాజంపై ఎక్కువగా ప్రభావం చూపే సినిమా ఇండస్ట్రీ డ్రగ్స్ నియంత్రణలో పాల్గొనాలని పిలుపునిచ్చారు. రాష్ట్రంలో డ్రగ్స్,సైబర్ క్రైమ్ నివారణకు సినీ ఇండస్ట్రీ తోడ్పడాలన్నారు.టికెట్ ధరల పెంపు,షూటింగ్ అనుమతుల కోసం ప్రభుత్వం దగ్గరకు వస్తున్నారు. రాష్ట్రంలో జరుగుతున్న డ్రగ్స్ వినియోగం గురించి కేవలం చిరంజీవి మాత్రమే స్పందించారు. కాగా సినిమాల ద్వారా సినీ ఇండస్ట్రీ వందలకోట్లు సంపాదిస్తోందని సీఎం వెల్లడించారు. అయితే సినిమా తీసేముందు నటీనటులతో డ్రగ్స్ నియంత్రణ వీడియోలు చేయించాలని సీఎం పేర్కొన్నారు. అలా డ్రగ్స్ నియంత్రణ వీడియోలు చేస్తేనే సినిమా ఇండస్ట్రీకి ప్రభుత్వం నుంచి పూర్తి సహకారం అందుతుందని సీఎం రేవంత్ రెడ్డి స్పష్టం చేశారు.