Home Page SliderTelangana

ప్రధాని మోదీతో సీఎం రేవంత్ రెడ్డి భేటీ

Share with

తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి, ప్రధాని నరేంద్రమోదీతో భేటీ అయ్యారు. తెలంగాణ సీఎంగా బాధ్యతలు చేపట్టిన తర్వాత తొలిసారి రేవంత్ రెడ్డి కలిసారు. రాష్ట్రానికి నిధులు, విభజన హామీలపై మోదీతో రేవంత్ రెడ్డి చర్చించారు. తెలంగాణకు సంపూర్ణ సహకారం అందించాల్సిందిగా అభ్యర్థించారు. తెలంగాణ ఆర్థిక పరిస్థితిని ప్రధానికి వివరించామన్నారు సీఎం రేవంత్ రెడ్డి, డిప్యూటీ సీఎం మల్లు భట్టి విక్రమార్క. ముఖ్యమంత్రి పెండింగ్‌లో ఉన్న ప్రాజెక్టులు, కేంద్ర ప్రభుత్వం నుండి రావాల్సిన బకాయిలకు సంబంధించిన అంశాలను ప్రధానితో ప్రస్తావించారు.

సీఎం రేవంత్ రెడ్డితోపాటు డిప్యూటీ సీఎం మల్లు భట్టి విక్రమార్క కూడా ప్రధానిని కలిశారు. తొలిసారిగా ప్రధానిని కలిసి రాష్ట్ర సమస్యలను వివరించామన్నారు సీఎం రేవంత్ రెడ్డి, డిప్యూటీ సీఎం మల్లు భట్టి విక్రమార్క. రాష్ట్ర ప్రయోజనాలు కాపాడాలని ప్రధానికి వివరించామన్నారు భట్టి. విభజన హామీలు నెరవేర్చాలని కోరామన్నారు. తెలంగాణకు రావాల్సిన గ్రాంట్స్ ఇప్పించాల్సిందిగా విజ్ఞప్తి చేశామన్నారు. బయ్యారం స్టీల్ ఫ్యాక్టరీ, కాజీపేట కోచ్ ఫ్యాక్టరీపై వివరించామన్నారు భట్టి. ఐటీఐఆర్ ప్రాజెక్టు గురించి ఆలోచించాల్సిందిగా మోదీకి విజ్ఞప్తి చేశామన్నారు.