Home Page SliderTelangana

గద్వాల్‌లో సీఎం కేసీఆర్ పర్యటన

Share with

ఈ రోజు తెలంగాణా సీఎం కేసీఆర్ గద్వాల్‌లో పర్యటించారు. ఈ మధ్య కాలంలో సీఎం కేసీఆర్ తెలంగాణాలోని ప్రతి జిల్లాలో బీఆర్ఎస్ పార్టీ కార్యాలయాన్ని ఏర్పాటు చేస్తూ వస్తున్నారు. అయితే ఆయన గద్వాల్ జిల్లాలో ఇటీవల బీఆర్ఎస్ పార్టీ జిల్లా కార్యాలయాన్ని ఏర్పాటు చేశారు. కాగా ఈ రోజు సీఎం కేసీఆర్ గద్వాల్‌ జిల్లాలో  బీఆర్ఎస్ కార్యాలయాన్ని ప్రారంభించారు. అంతేకాకుండా గద్వాల్‌లో కలెక్టర్ కార్యాలయాన్ని కూడా సీఎం ప్రారంభోత్సవం చేశారు. తెలంగాణాలో మరో 6 నెలల్లో అసెంబ్లీ ఎన్నికలు జరగనున్న నేపథ్యంలో బీఆర్ఎస్ పార్టీని దేశవ్యాప్తంగా,రాష్ట్రవ్యాప్తంగా బలోపేతం చేయడానికి కేసీఆర్ ఈ పార్టీ కార్యాలయాలను ఏర్పాటు చేస్తున్నట్లు తెలుస్తోంది. కార్యాలయ ప్రారంభోత్సవ అనంతరం ఆయన గద్వాల్‌లో ఏర్పాటు చేసిన బహిరంగ సభలో ప్రసంగించనున్నారు.