Home Page SliderTelangana

త్వరలోనే ఆసిఫాబాద్‌లో కలెక్టరేట్ ప్రారంభించనున్న సీఎం కేసీఆర్

Share with

తెలంగాణా సీఎం కేసీఆర్ ఇటీవల కాలంలో రాష్ట్రంలోన్ పలు జిల్లాల్లో కలెక్టరేట్‌లు ప్రారంభిస్తూ వస్తున్న విషయం తెలిసిందే.  ఈ నేపథ్యంలో ఆయన ఈ నెల 30న ఆసిఫాబాద్ జిల్లాలో పర్యటించనున్నారు. అంతేకాకుండా అక్కడ కొత్తగా నిర్మించిన జిల్లా కలెక్టరేట్,ఎస్పీ కార్యాలయాలను సీఎం ప్రారంభించనున్నారు. అనంతరం అసిఫాబాద్ జిల్లా కేంద్రంలో ఏర్పాటు చేసిన బహిరంగ సభలో సీఎం పాల్గొననున్నారు. కాగా ఈ సభలో సీఎం కేసీఆర్ ఆసిఫాబాద్ జిల్లాలోని రైతులకు పోడు భూముల పట్టాలను పంపిణీ చేయనున్నారు. దీంతో ఆసిఫాబాద్ జిల్లాలోని పోడు భూముల రైతులు ఆనందం వ్యక్తం చేస్తున్నారు.