Andhra PradeshHome Page Slider

ఎమ్మెల్యేలకు సీఎం జగన్ సీరియస్ వార్నింగ్

Share with

నేడు ఎమ్మెల్యేలతో సమావేశంలో ఏపీ సీఎం జగన్ ఎమ్మెల్యేలను సీరియస్‌గా హెచ్చరించారు. పనితీరు బాగుంటేనే ఎమ్మెల్యేలను కొనసాగిస్తామని సంచలన వ్యాఖ్యలు చేశారు. ఎమ్మెల్యేల పనితీరు బాగోలేక పోతే వారికి టికెట్లు ఇవ్వడం లేదని, గడప గడపకూ ప్రభుత్వం కార్యక్రమం ద్వారా ప్రజల్లోకి చొచ్చుకుని వెళ్లాలని సూచించారు. జగనన్న సురక్ష పథకం మీదే ఎక్కువగా ఫోకస్ చేశారని కూడా ఎమ్మెల్యేలు, మంత్రులు పేర్కొన్నారు. అర్హులందరికీ తప్పకుండా సంక్షేమ పథకాలు అందాలని జగన్ పేర్కొన్నారని వారంటున్నారు. వైసీపీ వర్క్‌షాప్‌లో జగన్ మాట్లాడుతూ 175 సీట్లు సాధించడం తప్పనిసరి అని ఆదేశించారు. సర్వేలలో ఎవరికి ప్రజాదరణ ఉంటే వారినే వచ్చే ఎన్నికలలో కొనసాగిస్తామని పేర్కొన్నారు జగన్. వచ్చే 9 నెలలు అత్యంత కీలకమని, కష్టపడి ప్రజల మనస్సు గెలుచుకోవాలని దిశానిర్థేశం చేశారు. జగనన్న సురక్ష పథకం తప్పకుండా ప్రజల్లో నాటుకుపోవాలని సూచించినట్లు తెలుస్తోంది. ప్రజలు ఇష్టపడకపోతే మీకే నష్టం అంటూ వార్నింగ్ ఇచ్చారు. మీ పనితీరు మెరుగుపరుచుకోమంటూ 15 మంది ఎమ్మెల్యేలకు వ్యక్తిగతంగా రిపోర్టును పంపిస్తామని జగన్ తెలిపారు.