Andhra PradeshHome Page Slider

పేదల పాలిట పెన్నిధి… ఆరా ఫౌండేషన్ కార్యక్రమాలకు ప్రశంశల వెల్లువ

Share with

ఆరా ఫౌండేషన్ ఆధ్వర్యంలో చిలకలూరిపేటలో క్రిస్మస్ సంబరాలు అంబరాన్ని తాకాయి. ఏటా చిలకలూరిపేట నియోజకవర్గంలో ఆరా ఫౌండేషన్ ఆధ్వర్యంలో క్రిస్మస్ వేడుకల నిర్వహించడం ఆనవాయితీగా వస్తోంది. క్రిస్మస్ పర్వదినం సందర్భంగా ఆరా సంస్థ నియోజకవర్గ వ్యాప్తంగా కేకులు పంచడంతోపాటు, పేదలకు వస్త్రాలను అందిస్తోంది. ఈ ఏడాది క్రిస్మస్ వేడుకల్లో భాగంగా కార్యక్రమంలో నియోజకవర్గంలో ఉన్న అన్ని చర్చిలకు కేకుల పంపిణీ చేసిన ఆరా ఫౌండేషన్ సిబ్బంది, క్రిస్మస్ వేడుకల్లోనూ పాల్గొన్నారు.

ఇక నియోజకవర్గంలో క్రిస్మస్ సందర్భంగా భారీ కార్యక్రమాన్ని ఏర్పాటు చేశారు. ఈ కార్యక్రమంలో స్థానిక ప్రజాప్రతినిధులు, ఆరా ఫౌండేషన్ చైర్మన్ షేక్ మస్తాన్ ఉరాఫ్ ఆరా మస్తాన్ పాల్గొన్నారు. చిలకలూరిపేట నియోజకవర్గంలో అన్ని మతాలు, కులాలు కలిసికట్టుగా జీవించాలన్నదే తన లక్ష్యమని.. ఇందుకోసం తాను మొదట్నుంచి తపిస్తున్నానని.. ఆరా ఫౌండేషన్ ద్వారా సమాజంలో మార్పు కోసం పనిచేస్తున్నానన్నారు. ఇటీవల కార్తీక దీపోత్సవం, నియోజకవర్గ ప్రజల సహకారంతో అద్భుతంగా నిర్వహించామన్న ఆరా మస్తాన్, తాజాగా క్రిస్మస్ వేడుకలను అంబరాన్ని తాకేలా జరగడానికి క్రైస్తవ సోదరులే కారణమన్నారు.

క్రీస్తు పర్వదినం సందర్భంగా ఏటా ఈ కార్యక్రమం నిర్వహిస్తున్నామని కార్యక్రమ నిర్వాహకులు చాపలమడగు రవి చెప్పారు. ప్రతి ఏటా ఆరా మస్తాన్ చొరవతో క్రిస్మస్ వేడుకలను నిర్వహిస్తున్నామని చెప్పారు. ఈ ఏడాది పట్టణంలో పోలీసులందరికీ నూతన వస్త్రాలు బహూకరించారు. గతంలో రంజాన్ సందర్భంగా చిలకలూరిపేట పట్టణం నరసరావుపేట రోడ్డు లోని గోల్కొండ గార్డెన్స్ లో ఇఫ్తార్ విందు, ఆధ్యాత్మిక సందేశం ఇప్పించడం జరిగిందన్నారు. ఏటా శివరాత్రి సమయంలో ఆరా మస్తాన్ గారి తాతగారైనా జనాబ్ షేక్ మహబూబ్ గారి జ్ఞాపకార్థం కోటప్పకొండ వద్ద మూడు రోజుల పాటు మొబైల్ వాహనాల ద్వారా అన్న ప్రసాద కార్యక్రమాన్ని సంస్థ నిర్వహిస్తోందని చెప్పారు.

ఆరా ఫౌండేషన్ ఆధ్వర్యంలో హెచ్ఐవి, ఎయిడ్స్ బాధితులకు మెడికల్ క్యాంపులు నిర్వహించడంతోపాటు, వారికి పౌష్టికాహర పంపిణీ నిర్వహిస్తున్నామన్నారు. తాను చదువుకున్న ప్రభుత్వ పాఠశాలకు 2015 నుండి అనేక అభివృద్ధి కార్యక్రమాల చేపట్టారని… గత ఏడాది ఇదే సమయం అనగా… 29.12.2022న పాఠశాల కొరకు ఎకరా భూమిని కొని ప్రభుత్వానికి రిజిష్టర్ చేయించారని… గుర్తు చేశారు. వీటితోపాటు స్థానికంగా ఆరా ఫౌండేషన్ ఆధ్వర్యంలో పేద విద్యార్థులకు స్కాలర్ షిప్‌లు అందిస్తున్నారని చెప్పారు. కరోనా సమయంలో నియోజకవర్గ ప్రజలకు ఉచితంగా కూరగాయలు అందించడంతోపాటుగా, జనతా బజార్ ద్వారా చౌక ధరలకు నిత్యవసర వస్తువులను అందించామన్నారు.