Home Page SliderNational

ఐశ్వర్యరాయ్-అభిషేక్ బచ్చన్ విడాకుల రూమర్స్‌కి చెక్

Share with

బాలీవుడ్ స్టార్ కపుల్ ఐశ్వర్యరాయ్-అభిషేక్ బచ్చన్ విడాకులు తీసుకోబోతున్నారని సోషల్ మీడియాలో కొన్ని రోజులుగా పుకార్లు షికార్లు చేస్తున్నాయి. అయితే ఈ వార్తలకు బచ్చన్ ఫ్యామిలీ ఒక్క వీడియోతో చెక్ పెట్టింది. కాగా ఈ జంట త్వరలోనే విడిపోతున్నారని నెట్టింట వార్తలు తెగ వైరల్ అవుతున్నాయి. ఈ మేరకు ఐశ్వర్యరాయ్ ఇప్పటికే అమితాబ్ బచ్చన్ ఇంటి నుంచి తన పుట్టింటికి వెళ్లిపోయినట్లు బాలీవుడ్‌లో రకారకాలుగా వార్తలు వస్తున్నాయి. అయితే వీటన్నింటికి బచ్చన్ ఫ్యామిలీ ఒక్క వీడియోతో ఫుల్ స్టాప్ పెట్టింది. కాగా ఈ రోజు ఐశ్వర్య కూతురు ఆరాధ్య స్కూల్ వార్షికోత్సవ వేడుకకు  అమితాబ్, ఐశ్వర్యరాయ్, అభిషేక్ బచ్చన్‌లు కలిసి హాజరయ్యారు. దీంతో ఈ విడాకుల రూమర్స్‌కు చెక్ పడినట్లైంది. కాగా ఈ వీడియోను అభిమానులు ప్రస్తుతం సోషల్ మీడియాలో తెగ షేర్ చేస్తున్నారు. ఈ ఈవెంట్‌లో ఐశ్యర్యరాయ్ అభిషేక్ బచ్చన్‌పై చేయి వేసి సరదాగా మాట్లాడుతూ లోపలికి వెళ్లారు. ఈ ఈవెంట్‌లోనే బచ్చన్ ఫ్యామిలీ అంతా సరదాగా డ్యాన్స్ కూడా చేసింది.దీంతో ఈ వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో బాగా వైరల్ అవుతోంది.