Home Page SliderNational

చంద్రయాన్ -3 రాకెట్ లాంఛ్..విమానం నుంచి చూస్తే..!

Share with

చంద్రయాన్-3 రాకెట్ లాంఛ్ నిన్న విజయవంతం అయిన విషయం తెలిసిందే. కాగా చంద్రయాన్-3 రాకెట్ నింగిలోకి దూసుకెళ్లడంతో  భారతీయులంతా ఎంతో గర్వంగా ఫీలయ్యారు. అయితే ఆ దృశ్యాన్ని విమానం నుంచి చూస్తే..ఆ అనుభూతే వేరు అని చెప్పాలి. నిన్న రాకెట్ లాంఛ్ అయిన తర్వాత విమానంలో నుంచి దాన్ని చూసినట్లు ఓ ప్రయాణికుడు వీడియో షేర్ చేశాడు. ఆ సమయంలో ఫ్లైట్ చెన్నై నుంచి ఢాకా వెళ్తున్నట్లు ప్రయాణికుడు తెలిపాడు. అంతేకాకుండా ఈ దృశ్యాన్ని చూసిన ఫ్లైట్ పైలట్ కూడా ఇది ఓ చారిత్రాత్మక ఈవెంట్ అని ప్రయాణికులకు అనౌన్స్ చేశారని వెల్లడించారు.