Andhra PradeshHome Page Slider

మోదీతో చేతులు కలిపే విషయంలో చంద్రబాబు ఆలోచనేంటంటే!

Share with

దేశ అభివృద్ధి కోసం ప్రధాని మోదీతో చేతులు కలుపుతారా అన్న రిపబ్లిక్ టీవీ చానెల్ చర్చలో చంద్రబాబు బదులిచ్చారు. ఊహాజనితమైన ప్రశ్నలకు తాను సమాధానం చెప్పలేనన్నారు. అందుకు ఇది సరైన వేదిక కాదన్నారు. బీజేపీ మేనిఫెస్టో, టీడీపీ మేనిఫెస్టో దగ్గరగా ఉన్నాయన్న ప్రశ్నకు ఆయన సమాధానం ఇచ్చారు. ప్రపంచ వ్యాప్తంగా భారతీయులు బలంగా ఉండాలన్నదే తన అజెండా అన్నారు. వరల్డ్‌లోనే ఇండియన్స్, నెంబర్ 1 కమ్యూనిటీగా ఉండాలన్నారు. అందులో 30-35 శాతం తెలుగు ప్రజలు ఉండాలన్నారు.

courtesy Republic Tv

తెలుగు ప్రజలు, భారతీయులు యూదుల కంటే ఎక్కువ శక్తిమంతులుగా ఉండాలన్నారు. ప్రస్తుతం యూదులు, భారతీయుల కంటే సంపన్నులుగా ఉన్నారని చంద్రబాబు చెప్పారు. ఐనప్పటికీ ఒక్కో వ్యక్తి సంపాదించే సంపదలో యూదుల కంటే భారతీయులు బెటర్‌గా ఉన్నారన్నారు. ఆంధ్రప్రదేశ్‌లో పేదరికం లేకుండా చేయాలన్నదే ధ్యేయమన్నారు. 2047 నాటికి, మధ్యతరగతి, ఎగువ మధ్యతరగతికి ప్రజలు చేరుకోవాలన్నారు. అదే తన విజన్ అన్నారు. దాని కోసమే పనిచేస్తున్నానన్నారు. దేశం కోసం ఎలాంటి అవసరమొచ్చినా తాను ముందుంటానన్నారు.

ప్రధాని మోదీ విషయంలో తాను మొదట్నుంచి ఒకటే చెబుతున్నాన్నారు చంద్రబాబు. పాజిటివ్ థింగ్స్‌కు తాను ఎల్లప్పుడూ మద్దతిచ్చానన్నారు. సమయం వచ్చినప్పుడు ఎన్డీఏలో కలిసే విషయం గురించి చెబుతానన్నారు. తనకు రాజకీయం ముఖ్యం కాదన్న చంద్రబాబు, వాజ్‌పేయి ప్రధానిగా ఉన్న సమయంలో ఏడు నుంచి ఎనిమిది కేబినెట్ బెర్తులు ఆఫర్ చేశారని గుర్తు చేశారు. అయితే వాటిని వేటిని అంగీకరించలేదన్నారు. దేశ అభివృద్ధి కోసమే తపించానన్నారు. ఈ రోజు అదే మాట మీద నిలబడ్డానన్నారు. రాజకీయాలు వేరు, అభివృద్ధి వేరు అని చంద్రబాబు చెప్పుకొచ్చారు. అభివృద్ధి ఎక్కడున్నా తాను అందులో భాగమయ్యానన్నారు.