Andhra PradeshHome Page Slider

పోలవరం ప్రాజెక్టుపై శ్వేతపత్రం విడుదల చేసిన చంద్రబాబు

Share with

పోలవరం ప్రాజెక్టుపై వాస్తవ పరిస్థితులను ప్రజలకు తెలియజేయాల్సిన అవసరం ఉందని ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు పేర్కొన్నారు. ఈ ప్రాజెక్టుపై శ్వేతపత్రాన్ని విడుదల చేశారు. నదుల అనుసంధానానికి గుండె వంటి పోలవరానికి జగన్ శాపంగా మారారని,జాతికి తగిన విద్రోహం అని విమర్శించారు. రాష్ట్రాన్ని నాశనం చేసే హక్కు ఎవరికీ లేదని, గత ముఖ్యమంత్రి కాలంలో పోలవరానికి ఎంత నష్టం జరిగిందో ప్రజలకు తెలియాలనే ఈ శ్వేతపత్రాన్ని విడుదల చేస్తున్నానని చెప్పారు. బహళార్థ సాధక జాతీయ ప్రాజెక్టు పనులు జరగనీయకుండా చేశారన్నారు. ఏపీకి 2014లో జరిగిన నష్టం కంటే, 2019 నుండి 2014 వరకూ జగన్ పాలనలో ఎక్కువ నష్టం జరిగిందన్నారు. ఈ ప్రాజెక్టు పరిధిలో 7.2  లక్షల ఎకరాలకు సాగునీరు అందుతుందన్నారు. 960 మెగావాట్ల విద్యుత్, 30 లక్షల మంది జనాభాకు త్రాగునీరు లభిస్తుందన్నారు. ఈ ప్రాజెక్టు 1920 నుండి ఉన్న ఆంధ్రప్రజల కల అన్నారు. కాటన్ దొర ధవళేశ్వరం ప్రాజెక్టు కట్టినప్పుడే ఈ పోలవరం ప్రదేశంలో కడితే బాగుండనుకున్నారు. కానీ బడ్జెట్ కారణంగా కట్టలేకపోయారు. ఈ ప్రాజెక్టు కంటే పెద్దది ప్రపంచంలోనే లేదన్నారు. ప్రాజెక్టు ఫ్రొఫైల్‌ను అందరికీ వివరించారు. ఈ పోలవరం ప్రాజెక్టుకు సంబంధించిన మరో 7 శ్వేతపత్రాలు కూడా విడుదల చేస్తామన్నారు.