Andhra PradeshHome Page Slider

పుష్ప సినిమాలో తన ఫోటోపై స్పందించిన చంద్రబాబు

Share with

టాలీవుడ్ స్టైలిష్ హీరో అల్లు అర్జున్ పుష్ప సినిమాతో పాన్ ఇండియా హీరోగా మంచి పేరు సంపాదించుకున్నారు. తాజాగా ఆయనకు పుష్ప సినిమాలో తన నటనకు గాను ఉత్తమ నటుడిగా జాతీయ అవార్డు వచ్చిన విషయం తెలిసిందే. దీంతో గత రెండు రోజుల నుంచి సోషల్ మీడియాలో అల్లు అర్జున్‌కు పలువురు ప్రముఖులతోపాటు ఆయన అభిమానులు పెద్ద్ ఎత్తున శుభాకాంక్షలు తెలియజేస్తున్నారు.  ఈ మేరకు ప్రస్తుతం సోషల్ మీడియాలో అల్లు అర్జున్ పేరు బాగా వైరల్ అవుతోంది. అయితే అల్లు అర్జున్‌కు జాతీయ అవార్డు తెచ్చిపెట్టిన పుష్ప సినిమాలో ఏపీ మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఫోటో ఉండడం ప్రస్తుతం రాజకీయాల్లో తీవ్ర చర్చనీయాంశమైంది. కాగా దీనిపై టీడీపీ అధ్యక్షుడు చంద్రబాబు స్పందించారు. ఆయన మాట్లాడుతూ..అల్లు అర్జున్ పుష్ప సినిమాలో తన ఫోటో పెట్టడం చూసి వైసీపీ వాళ్లు ఏడుస్తున్నారని అన్నారు. తన నటనతో మెప్పించిన బన్నీకి జాతీయ అవార్డు ఇచ్చారు. అయితే ఏపీలో ఉన్న నిజమైన వైసీపీ స్మగ్లర్లకు ఏ అవార్డు ఇవ్వాలి అని ఆయన ప్రశ్నించారు. కాగా పుష్ప సినిమాలో కొన్ని సీన్లలో నా ఫోటో ఉంది. నేను సీఎంగా ఉన్నప్పుడు ఎర్రచందనం స్మగ్లర్లను కంట్రోల్ చేశానని పుష్ప సినిమాలో నా ఫోటో పెట్టి ఉండొచ్చని చంద్రబాబు అభిప్రాయపడ్డారు. అయితే దానికే వైసీపీ వాళ్లు ఏడుస్తున్నారని చంద్రబాబు వెల్లడించారు.