Andhra PradeshHome Page Slider

చంద్రబాబు కుట్రపూరితంగానే చిత్తూరు డెయిరీని మూసేశారు:సీఎం జగన్

Share with

ఏపీ సీఎం జగన్ ఇవాళ చిత్తూరు జిల్లాలో పర్యటించారు.  అయితే ముందుగా సీఎం చిత్తూరులో అమూల్ డెయిరీకి భూమిపూజ చేసి.. శంకుస్థాపన చేశారు. అనంతరం చిత్తూరులో ఏర్పాటు చేసిన భారీ బహిరంగ సభలో సీఎం ప్రసంగించారు. ఈ సందర్భంగా సీఎం మాట్లాడుతూ..20 ఏళ్ల క్రితం చంద్రబాబు కుట్ర పూరితంగానే చిత్తూరు డెయిరీని మూసేశారన్నారు. ఆ విధంగా చంద్రబాబు కుట్రకు బలైపోయిన చిత్తూరు డెయిరీని తిరిగి ప్రారంభిస్తున్నందుకు సంతోషంగా ఉందని సీఎం జగన్ అన్నారు. ఏపీలో చంద్రబాబు హెరిటేజ్‌ను అభివృద్ధి చేసేందుకే..చిత్తూరు డెయిరీని పూర్తిగా నిర్లక్ష్యం చేశారని సీఎం జగన్ విమర్శించారు. అంతేకాకుండా చంద్రబాబు తన స్వార్థం కోసం పాడి రైతులను దారుణంగా మోయం చేశారని సీఎం మండిపడ్డారు.  ఎలాంటి నోటీసులు ఇవ్వకుండా హెరిటేజ్ కోసమే చిత్తూరు డెయిరీని చంద్రబాబు మూసేశారని సీఎం జగన్ ఆరోపించారు.