Andhra PradeshHome Page Slider

చంద్రబాబు జైల్లోనే ఉన్నందున తెలంగాణ ఎన్నికల్లో పోటీచేయలేం…

Share with

గత నెలలో చంద్రబాబు జైల్లోనే ఉన్నందున టీడీపీ తెలంగాణ ఎన్నికలకు దూరంగా ఉండాలని నిర్ణయం తీసుకొంది. నాడు టీడీపీ తెలంగాణ అధ్యక్షుడుగా ఉన్న కాసాని జ్ఞానేశ్వర్, రాజమండ్రి సెంట్రల్ జైలులో చంద్రబాబుతో చర్చించగా… తెలంగాణలో ఎన్నికల్లో పోటీ చేయలేమని ఆయన చెప్పినట్టు ప్రచారం జరిగింది. తాను జైలులో ఉన్న కారణంగా, ఎన్నికల ప్రచారం చేయడం సాధ్యం కాదని, ఇదే విషయాన్ని పార్టీ కేడర్‌కు వివరించాల్సిందిగా జ్ఞానేశ్వర్‌కు చంద్రబాబు సూచించారు. నవంబర్ 30న తెలంగాణ అసెంబ్లీకి ఓటింగ్ జరగనుంది. తెలంగాణలో టీడీపీకి కొంత మద్దతు ఉంది. 2014 అసెంబ్లీ ఎన్నికల్లో 15 సీట్లు, 2018లో రెండు సీట్లు ఆ పార్టీ గెలుచుకుంది. అయితే, ఎన్నికైన ఎమ్మెల్యేలు తర్వాత అధికార పార్టీ బీఆర్ఎస్ గూటికి చేరిపోయారు. ఐతే చంద్రబాబు అరెస్ట్ సమయంలో… తెలంగాణాలో మద్దతుదారులను ప్రభుత్వం అడ్డుకుందని, కనీసం బీఆర్ఎస్ నాయకులు సంఘీభావం తెలియజేయలేదని ఆరోపించారు. హైటెక్ సిటీ ప్రాంతంలో తనకు మద్దతుగా నిరసనను తెలపడానికి కూడా అనుమతివ్వనందున ఆవేదన వ్యక్తం చేశారు.