Andhra PradeshHome Page Slider

జనసేన మంత్రులకు చంద్రబాబు బంపర్ ఆఫర్

Share with

జనసేన అధ్యక్షుడు పవన్ కళ్యాణ్‌తో పాటు ఇతర జనసేన మంత్రులకు కూడా ముఖ్యమంత్రి చంద్రబాబు బంపర్ ఆఫర్ ఇవ్వనున్నారు. వీరికి కీలక శాఖలు కేటాయించనున్నట్లు తెలుస్తోంది. నేడు ముఖ్యమంత్రిగా సాయంత్రం బాధ్యతలు స్వీకరించబోతున్నారు చంద్రబాబు. అనంతరం ఇతర మంత్రిత్వ శాఖలు కూడా ప్రకటించబోతున్నాని ఇప్పటికే తెలియజేశారు. పవన్ కళ్యాణ్‌కు డిప్యూటీ చీఫ్ మినిష్టర్ పదవితో పాటు కీలకమైన గ్రామీణాభివృద్ధి, అటవీ, పర్యావరణ శాఖలను కేటాయిస్తారని తెలిసింది. ఈ శాఖలు పవన్ కోరుకున్నారని, గ్రామీణ, వ్యవసాయ నేపథ్యం ఉన్న శాఖలు అడిగారని సమాచారం. జనసేన ముఖ్యనేత నాదెండ్ల మనోహర్‌కు పౌరసరఫరా శాఖ, కందుల దుర్గేష్‌కు పర్యాటకం, సినిమాటోగ్రఫీ శాఖలను కేటాయించనున్నారు. లోకేష్‌కు కూడా కీలకమైన శాఖను అప్పగిస్తారని వార్తలు వస్తున్నాయి.