Andhra PradeshHome Page Slider

చంద్రబాబు లక్ష్యం DPT కానీ జగనన్న లక్ష్యం మెరుగైన వైద్యసేవలే

Share with

ప్రజలందరికీ మెరుగైన వైద్యం అందించాలనేదే వైఎస్సార్ సీపీ ప్రభుత్వ లక్ష్యమని ఏపీ ఆరోగ్యశాఖ మంత్రి విడదల రజిని స్పష్టం చేశారు. అందుకే దేశంలో ఎక్కడా లేని విధంగా ఫ్యామిలీ డాక్టర్ కాన్సెప్టును తీసుకువచ్చామని మంత్రి తెలిపారు. సీఎం జగన్ వైద్య ఆరోగ్యశాఖలో ఎన్నో విప్లవాత్మక మార్పులు తీసుకొచ్చారన్నారు. స్వాతంత్రం వచ్చిన దగ్గర నుంచి ఇప్పటివరకు వైద్య ఆరోగ్యశాఖలో వైఏస్సార్ సీపీ ప్రభుత్వం భర్తీ చేసిన అన్ని ఖాళీలు ఏ ప్రభుత్వమూ భర్తీ చేయలేదని మంత్రి వెల్లడించారు. వైసీపీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక వైద్య ఆరోగ్యశాఖలో నాలుగేళ్లలో 49 వేల ఉద్యోగాలు భర్తీ చేశామని మంత్రి రజిని పేర్కొన్నారు. ఈ సందర్భంగా మంత్రి విడదల రజిని ప్రతిపక్ష నేత చంద్రబాబుపై మరోసారి తీవ్రస్థాయిలో మండిపడ్డారు. టీడీపీ అధినేత చంద్రబాబు పాలనలో దోచుకో, పంచుకో, తినుకో పాలనా విధానం జరిగిందని మంత్రి రజిని ఆరోపించారు. చంద్రబాబు హయంలో రాష్ట్రానికి ఒక్క ప్రభుత్వ మెడికల్ కాలేజీ కూడా రాలేదని విమర్శించారు. గత ప్రభుత్వ హయంలో సెల్ ఫోన్ వెలుతురులో డాక్టర్లు ఆపరేషన్లు చేసిన రోజులు ఉన్నాయని మంత్రి విడదల రజిని గుర్తుచేశారు.