Home Page SliderTelangana

‘రాష్ట్రంలో పారిశ్రామికాభివృద్దే మాధ్యేయం’..రేవంత్ రెడ్డి

Share with

తెలంగాణ రాష్ట్రంలో పారిశ్రామికాభివృద్ధికి తమ ప్రభుత్వం కట్టుబడి ఉందని రాష్ట్ర ముఖ్యమంత్రి ఏ. రేవంత్ రెడ్డి పేర్కొన్నారు. డా.బీ.ఆర్. అంబేద్కర్ తెలంగాణా సచివాలయంలో రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి తో ఫాక్స్కాన్ కు చెందిన హాన్ హాయ్ ప్రెసిషన్ ఇండస్ట్రీస్ ప్రతినిధి వీ లీ నేతృత్వంలోని  ప్రతినిధి బృందం నేడు కలిసింది.

      ఈ సందర్బంగా సి.ఎం మాట్లాడుతూ,  ” ప్రజల ఆకాంక్షలను  కాపాడే బాధ్యత  కొత్తగా ఏర్పడిన తమ ప్రభుత్వంపై ఉందని అన్నారు. అన్ని వర్గాలకు స్నేహపూర్వకంగా ఉండే విధానాన్ని అవలంబిస్తున్నాం. కాబట్టే, పారిశ్రామిక వేత్తలకు కూడా పూర్తి సహాయ, సహకారాలందిస్తామని వాగ్దానం చేశారు. రాష్ట్రాన్ని పారిశ్రామికంగా దేశంలోనే అగ్రగామిగా ఉంచేందుకు కావాల్సిన అన్ని చర్యలను తీసుకుంటామని తెలియచేసారు. తెలంగాణలో ఎలక్ట్రానిక్స్ పరిశ్రమ అభివృద్దిని మరింత వేగవంతం చేస్తాము. కొంగర కలాన్ ఉత్పాదక కేంద్రం నిర్వహణకు అవసరమైన సహాయ సహకారాలను అందిస్తాము. ఫాక్సాకాన్ సంస్థ చేపట్టబోయే భవిష్యత్ ప్రాజెక్టులకు కూడా అవసరమైన అన్ని సహాయ సహకారాలను అందిస్తాము”. అని పేర్కొన్నారు.

ఈ ఫాక్సాకాన్ సంస్థ ఆపిల్ ఐఫోన్లను తయారుచేస్తుంది. చైనా, వియత్నాం, థాయ్లాండ్, మలేషియా, అమెరికా, యూరప్, భారత్ సహా 24 దేశాలలో ఫాక్సాకాన్ సంస్థ కార్యకలాపాలు సాగిస్తున్నది. మన దేశంలో శ్రీసిటి (ఎపి), శ్రీపెరంబుదూర్ (తమిళనాడు), తెలంగాణ (కొంగరకలాన్) మరియు కర్ణాటక (బెంగళూరు సమీపంలో) సంస్థ పనిచేస్తున్నది. ఫాక్సాకాన్ సంస్థ ఎలక్ట్రానిక్స్ తయారుచేసే వ్యవస్థలను ఏర్పాటు చేయడం ద్వారా 1,00,000 ఉద్యోగాలను కల్పిస్తామనే హామితో గత తెలంగాణ ప్రభుత్వంతో అవగాహనా ఒప్పందం (MoU)పై సంతకం చేసింది.  మొదటి దశలో, వచ్చే రెండేళ్లలో 25000 ఉద్యోగాలు కల్పించనున్నారు. ఈ కార్యక్రమంలో రాష్ట్ర ఐ.టి , పరిశ్రమల శాఖ మంత్రి దుద్దిళ్ల శ్రీధర్ బాబు, సి.ఎస్. శాంతి కుమారి ఇతర ఉన్నతాధికారులు ఈ సమావేశంలో పాల్గొన్నారు.