Home Page SliderNational

CBSE 12వ తరగతి ఫలితాలు విడుదల

Share with

సెంట్రల్ బోర్డ్ ఆఫ్ సెకండరీ ఎడ్యుకేషన్ (CBSE) 12వ తరగతి బోర్డు పరీక్ష ఫలితాలను ప్రకటించింది. ఈ విషయాన్ని బోర్డు తన ట్విట్టర్ హ్యాండిల్‌లో ప్రకటించింది. ఫలితాలను అధికారిక వెబ్‌సైట్‌లలో పోస్ట్ చేశారు. ఫలితాలను cbseresults.nic.in, cbse.gov.in సైట్లలో చూడొచ్చు. ఈ సంవత్సరం ఉత్తీర్ణత శాతం 87.33%, ఇది 2019లో 83.40% మాత్రమే. అనారోగ్యకరమైన పోటీని నివారించే ప్రయత్నంలో విద్యార్థులకు ఫస్ట్, సెకండ్, థర్డ్ గ్రేడ్‌లను ఇవ్వడం లేదని బోర్డు తెలిపింది. అయితే సబ్జెక్టులలో అత్యధిక మార్కులు సాధించిన 0.1 శాతం మంది విద్యార్థులకు CBSE మెరిట్ సర్టిఫికేట్ జారీ చేస్తామంది.

దేశంలో అత్యంత ఉత్తమ ఉత్తీర్ణత కేరళ రాజధాని తిరువనంతపురంలో నమోదైంది. ఇక్కడ 99,91 శాతం మంది విద్యార్థులు పరీక్షలో ఉత్తీర్ణత సాధించారు. ఇక యూపీలోని ప్రయాగ్‌రాజ్ జాబితాలో చివరి స్థానంలో ఉంది. ఇక్కడ 78.05 శాతం మంది మాత్రమే పాసయ్యారు. CBSE 10వ తరగతి బోర్డు పరీక్ష 2023 ఫిబ్రవరి 15, మార్చి 21 మధ్య నిర్వహించగా, 12వ తరగతి బోర్డు పరీక్షలు ఫిబ్రవరి 15 – ఏప్రిల్ 5, 2023 వరకు జరిగాయి.