Home Page SliderNational

ఒడిశా ప్రమాదంపై విచారణ ప్రారంభించిన సీబీఐ

Share with

ఒడిశా రైలు ప్రమాదం ఎన్నో కుటుంబాల్లో  తీవ్ర విషాదాన్ని నింపింది. ఈ ఘోర ప్రమాదంలో 278 మంది ప్రయాణికులు మృత్యువాత పడ్డారు. కాగా మరో 1000 మందికి పైగా ప్రయాణికులు తీవ్రంగా గాయపడ్డారు. అయితే ఇంతటి ఘోర ప్రమాదానికి కారణం ఏంటో ఖచ్చితంగా ఎవరు చెప్పలేకపోతున్నారు. దీంతో రైల్వేశాఖ అధికారులు ఈ ప్రమాదంపై విచారణ జరపాలని సీబీఐని కోరారు. ఈ నేపథ్యంలో సీబీఐ దీనిపై విచారణను ప్రారంభించినట్లు తెలుస్తోంది. కాగా ఈ విషయాన్ని భువనేశ్వర్ డివిజినల్ రైల్వే మేనేజర్ రింకేశ్ రాయ్ తెలిపారు. ఆయన మాట్లాడుతూ..ఘటనాస్థలానికి సీబీఐ వచ్చింది.విచారణ ప్రారంభించిందన్నారు. ఈ ప్రమాదంలో ఇప్పటి వరకు 278 మంది చనిపోయారన్నారు. 1100 మంది గాయపడ్డారన్నారు. 900 మంది డిశ్చార్జ్ అయ్యారన్నారు. 200 మంది ఆసుపత్రుల్లో చికిత్స పొందుతున్నారన్నారు. ఇంకా 101 మంది మృతదేహాలను గుర్తించాల్సి ఉంది అని ఆయన వెల్లడించారు.