Home Page SliderInternational

ట్విటర్‌కు బైబై..థ్రెడ్స్ యూప్‌కు హాయ్ అంటున్న యూజర్స్

Share with

ట్విటర్‌కు పోటీగా మెటా సంస్థ రూపొందించిన థ్రెడ్స్ యాప్ ఈ రోజే అందుబాటులోకి వచ్చింది. దీంతో ఈ థ్రెడ్స్ యాప్‌పై నెట్టింట బాగా చర్చ జరుగుతోంది. కాగా ఈ రోజు నుంచే ఈ యాప్ గూగుల్ ప్లేస్టోర్‌లోకి అందుబాటులోకి రాగా..యూజర్లు తమ ఇన్‌స్టా అకౌంట్‌తో థ్రెడ్స్ ‌లోకి లాగిన్ అవుతున్నారు. కాగా ట్విటర్‌లో ఇప్పటికే పోస్టులపై పరిమితి విధించారు. దీంతో యూజర్లు థ్రెడ్స్ యాప్‌కు షిఫ్ట్ అవుతున్నట్లు ట్వీట్స్ చేస్తున్నారు. అయితే ఈ యాప్ గురించి ఇప్పటివరకు 13 లక్షల ట్వీట్స్ వచ్చినట్లు తెలుస్తోంది. దీంతో ప్రస్తుతం #Threads ట్విటర్‌లో ట్రెండ్ అవుతోంది.