Andhra PradeshHome Page Slider

‘మత సామరస్యంతోనే నవసమాజ నిర్మాణం’..ఆరా మస్తాన్

Share with

‘మత సామరస్యంతోనే నవసమాజ నిర్మాణం సాధ్యమని’ ఆరా ఫౌండేషన్ ఛైర్మన్, రాజకీయ వ్యూహకర్త ఆరా మస్తాన్ పేర్కొన్నారు. బుధవారం చిలకలూరిపేట పట్టణ శివారులోని చినపసుమర్రు అయ్యప్ప దేవాలయంలో పడిపూజ మహోత్సవం కన్నుల పండువగా నిర్వహించారు. ఈ కార్యక్రమంలో ఆరా ఫౌండేషన్ ఛైర్మన్ ఆరా మస్తాన్ ఉరాఫ్ షేక్ మస్తాన్ పాల్గొన్నారు.

 ప్రత్యేక అతిథిగా విచ్చేసిన  ఆరా ఫాండేషన్ ఛైర్మన్ ఆరా మస్తాన్ కి వేదపండితులు, పూజారులు ప్రత్యేక పూజలు చేసి ఆశీర్వదించారు. అనంతరం దేవస్ధానం కమిటీ ఆరా మస్తాన్ ను దుశ్శాలువ కప్పి గజమాలతో ఘనంగా సత్కరించారు. ఈ సందర్భంగా ఆరా మస్తాన్ ఆలయ కమిటీ సభ్యులు అభినందించారు. దేవస్థానంలో అయ్యప్ప భక్తులకు అన్నప్రసాద వితరణకు ఆర్దికసాయం అందించారని కృతజ్ఞతలు తెలిపారు. 15-10-23 నుండి, 15-1-24 వరకూ 93 రోజుల పాటు అయ్యప్ప భక్తులకు అన్నదానానికి అవసరమైన 100 క్వింటాళ్ల బియ్యాన్ని ఆరా మస్తాన్ పంపించారని కొనియాడారు. రూ. 5,30,000 ఆరా ఫౌండేషన్ తరపున అందజేశారని పేర్కొన్నారు. ఆరా పౌండేషన్ చేస్తున్న సేవా కార్యక్రమాలను ఎంతగానో ప్రశంసిస్తూ, భవిష్యత్ లో మస్తాన్ మరింత ఉన్నతమైన స్ధానానికి చేరుకుని మరెన్నో సేవా కార్యక్రమాలు నిర్వహించాలని అకాంక్షించారు.

ఈసందర్భంగా ఆరా మస్తాన్ పడి పూజలో పాల్గొన్నారు. అనంతరం ఆయన మాట్లాడుతూ భగవంతుని కృపతో ఇలాంటి దైవ కార్యక్రమాలకు సహాయ సహాకారాలు అందిస్తున్నానని తెలిపారు.అన్ని మతాల సామరస్యతను గౌరవిస్తానని, నవసమాజ నిర్మాణం జరగాలన్నదే తన కోరిక అని పేర్కొన్నారు. తనకు ఈ అవకాశం కల్పించిన అయప్పస్వామి దేవస్థాన నిర్వాహకులకు, భక్తులకు, అయ్యప్పమాలధారులకు తన కృతజ్ఞతలు తెలియజేశారు.

ఈ పూజా కార్యక్రమాల్లో అయ్యప్ప మాలధారులు,భక్తులు  భావోద్వేగానికి గురయ్యారు. అయ్యప్పపాటలకు అనుగుణంగా నృత్యం చేశారు. శివుడు,పార్వతి,అంజనేయుడు వేషధారులు చేసిన నృత్య రూపాలు విశేషంగా భక్తులను ఆకట్టుకున్నాయి.