Home Page SliderTelangana

బీఆర్‌ఎస్ భారీ వ్యూహం- కేసీఆర్ మహారాష్ట్ర పర్యటన

Share with

బీఆర్‌ఎస్ పార్టీని జాతీయపార్టీగా మార్చడానికి కేసీఆర్ భారీ వ్యూహంతో రెడీ అయ్యారు. 600 కార్లతో, 2బస్సులతో భారీ ర్యాలీగా  2 వేల మంది బీఆర్‌ఎస్ నేతలతో కలిసి రెండు రోజుల మహారాష్ట్ర పర్యటనకు బయలుదేరుతున్నారు కేసీఆర్. చాలామంది మంత్రులు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు ఈ ర్యాలీలో పాల్గొంటున్నారు. ప్రగతి భవన్ నుండి బయలుదేరిన ఈ కాన్వాయి పంజాగుట్ట, అమీర్ పేటల మీదుగా సంగారెడ్డి, జహీరాబాద్‌ల మీదుగా వెళ్లి మహారాష్ట్రలో ప్రవేశించబోతోంది. లంచ్ టైమ్‌కి ఒమర్గా చేరుకుంటారని, రాత్రి నాటికి సోలాపూర్ చేరుకుని అక్కడ బస చేస్తారని సమాచారం. కేసీఆర్ బయలు దేరే ముందే హోంమంత్రి మహ్మమూద్ అలీతో చేతికి దట్టీ కట్టించుకున్నారు. ముఖ్యకార్యక్రమం నిమిత్తం కేసీఆర్ బయలుదేరేటప్పుడు ఇలా దట్టీ కట్టించుకుంటారట. ఈ యాత్రలో  రాజకీయ పర్యటనతో పాటు తుల్జాభవానీ, విఠలేశ్వరుని ఆలయాలు కూడా దర్శించుకోబోతున్నారు. పండరీ పురంలో జరిగే జాతరలో మహారాష్ట్ర రైతులు భారీ సంఖ్యలో పాల్గొంటారు. దీనితో  రైతులను భారీ సంఖ్యలో కలుసుకుని వారితో పబ్లిక్ సమావేశం ఏర్పాటు చేయబోతున్నారు.