Home Page SliderTelangana

బీఆర్ఎస్, కాంగ్రెస్ అజెండా ఒక్కటే: యోగి ఆదిత్యనాథ్

Share with

వేములవాడ: బీఆర్ఎస్, కాంగ్రెస్ అజెండా ఒక్కటేనని, వ్యక్తిగత అభివృద్ధి కోసమే వాళ్లు పనిచేస్తారని యూపీ సీఎం యోగి ఆదిత్యనాథ్ అన్నారు. కాంగ్రెస్ అధికారంలో ఉంటే కరోనా వ్యాక్సిన్, పేదలకు ఉచితంగా బియ్యం ఇచ్చేదా? అని ప్రశ్నించారు. ఎంఐఎంకు భయపడటం వల్లే సీఎం కేసీఆర్ తెలంగాణ విమోచన దినోత్సవాన్ని నిర్వహించడం లేదని.. బీజేపీ అధికారంలోకి రాగానే ఘనంగా నిర్వహిస్తామని చెప్పారు. ఇక్కడి పార్టీలు దిగజారుడు రాజకీయాలు చేస్తున్నాయి. దీనికి నిదర్శనమే ముస్లిం రిజర్వేషన్లు. బీజేపీని గెలిపిస్తే ముస్లిం రిజర్వేషన్లు రద్దుచేసి, వెనకబడిన వర్గాలకు అందేలా చర్యలు తీసుకుంటాం. మోడీ ప్రధాని అయ్యాక అంతర్జాతీయంగా భారతదేశం తలెత్తుకునే స్థాయికి ఎదిగిందని యోగి అన్నారు. వేములవాడ బీజేపీ అభ్యర్థి వికాస్‌రావును అత్యధిక మెజార్టీతో గెలిపించాలని ఓటర్లను యోగి ఆదిత్యానాథ్ కోరారు.