Home Page SliderNational

“BRO” సినిమా@100 కోట్లు

Share with

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్‌కి ఉన్న ఫ్యాన్ ఫాలోయింగ్ గురించి ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. ఎందుకంటే ఆయన ఫ్యాన్స్ పవన్ కళ్యాణ్ లాగానే చాలా పవర్ ఫుల్. దీంతో పవన్ కళ్యాణ్ ఏ సినిమా వచ్చినా భారీ వసూళ్లతో బాక్సాఫీస్‌ను షేక్ చేస్తుంటారు. ఈ మేరకు ఇటీవల పవర్ స్టార్,సాయిధరమ్ తేజ్ కాంబోలో వచ్చిన “BRO సినిమా కలెక్షన్ల సునామీ సృష్టిస్తోంది. కాగా పవర్ స్టార్ పవన్ కళ్యాణ్, సుప్రీమ్‌హీరో సాయిధరమ్ తేజ్ కలిసి నటించిన సినిమా “BRO”. ఈ నెల 28న ప్రేక్షకుల ముందుకు వచ్చిన విషయం తెలిసిందే.అయితే ఈ సినిమా విడుదలైన 3 రోజుల్లోనే రూ.100 కోట్ల క్లబ్‌లో చేరింది. ప్రపంచవ్యాప్తంగా ఈ సినిమాకు ఇప్పటికే రూ.100 కోట్లకు పైగా కలెక్షన్లు వచ్చానీ సినీ వర్గాలు వెల్లడించాయి. కాగా ఈ సినిమాతో పవన్ కళ్యాణ్ ఖాతాలోకి 6 రూ.100కోట్ల సినిమాలు చేరాయి. మరోవైపు సాయిధరమ్ తేజ్‌ ఖాతాలోకి 2 రూ.100 కోట్ల సినిమాలు చేరినట్లు తెలుస్తోంది.