Home Page SliderNational

“ఉస్తాద్ భగత్‌సింగ్”తో ఈసారి పర్ఫార్మెన్స్ బద్దలైపోద్ది

Share with

గతంలో పవన్ కళ్యాణ్ ,హరీష్ శంకర్ కాంబోలో వచ్చిన గబ్బర్ సింగ్ బాక్సాఫీసును షేక్ చేసి బ్లాక్ బస్టర్‌గా నిలిచిన విషయం తెలిసిందే.  అయితే మరోసారి బాక్సాఫీసు వద్ద కలెక్షన్ల సునామీ సృష్టించేందుకు ఈ కాంబో సిద్ధం అయ్యింది. కాగా పవన్ కళ్యాణ్ హీరోగా హరీష్ శంకర్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న సినిమా “ఉస్తాద్ భగత్ సింగ్” నుంచి లేటెస్ట్ అప్‌డేట్ వచ్చేసింది. పవర్‌స్టార్ పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్ కోసం ఉస్తాద్ భగత్‌సింగ్ చిత్రయూనిట్ ఓ వీడియో గ్లింప్స్‌ను రిలీజ్ చేసింది. ఇటీవల ఈ సినిమా నుంచి రిలీజ్ అయిన పోస్టర్స్ సినిమాపై అంచనాలను పెంచాయి. అయితే ఈ రోజు విడుదలైన గ్లింప్స్ వీడియో సినిమాపై మరింత ఆసక్తిని రేకెత్తిస్తుంది.  కాగా ఈ గ్లింప్స్ వీడియోలో పవన్ కళ్యాణ్ చెప్పే “ఈసారి పర్ఫార్మెన్స్ బద్దలైపోద్ది” అనే  డైలాగ్ హైలెట్‌గా నిలిచింది.