Home Page SliderTelangana

 వికారాబాద్‌లో కూడా ఐస్‌క్రీమ్ సెంటర్లపై మెరుపుదాడులు

Share with

చందానగర్‌లో నకిలీ ఐస్‌క్రీమ్ గుట్టు రట్టయినప్పడి నుండి అప్రమత్తమయ్యారు పోలీసులు. వికారాబాద్  జిల్లాలో కూడా  ఐస్‌క్రీమ్ సెంటర్లపై మెరుపుదాడులు చేశారు. తాండూరు పట్టణంలో నందని, రాయల్ ఐస్‌క్రీమ్ కేంద్రాలపై టాస్క్‌ఫోర్స్ అధికారులు దాడులు చేశారు. 150 కిలోల ఐస్‌క్రీమ్‌తో పాటుగా కాలం చెల్లిన వెనీలా ఫ్లేవర్, బట్టర్‌స్కాచ్, నకిలీ రంగులు సీజ్ చేశారు. ఈ దాడుల్లో పట్టుబడ్డ శ్రీధర్, వహీద్‌లను పోలీసులు అరెస్టు చేశారు. ప్రజలు, చిన్నారుల ఆరోగ్యంతో చెలగాటమాడుతున్న ఈ నకిలీ ఐస్‌క్రీమ్‌లపై సర్వత్రా భయాందోళనలు కలుగుతున్నాయి.