Home Page SliderNational

కర్ణాటక ఓటర్లకు వరాలజల్లు

Share with

కొత్త కాంగ్రెస్ ప్రభుత్వం కర్ణాటక ఓటర్లపై వరాలజల్లు కురిపించబోతోంది. తమకు సంపూర్ణమెజారిటీ కట్టబెట్టి, ప్రభుత్వ పాలనా పగ్గాలు అప్పగిస్తున్న కర్ణాటక ప్రజలకు ఎన్నికల హామీలో ఇచ్చిన మాటను నిలబెట్టుకుంటామంటున్నారు ప్రభుత్వ పెద్దలు. ఇంకా కొత్త ముఖ్యమంత్రి ఎవరనే విషయంపై అనిశ్చితి  ఉన్నప్పటికీ కాంగ్రెస్ పాలనా విషయాలపై పథకాలు వేస్తోంది. ప్రభుత్వ ఏర్పాటుపై వడివడిగా అడుగులు వేస్తున్నారు. ఇప్పటికే ఐదు గ్యారెంటీ స్కీమ్‌ల అమలుకు ఫైల్స్‌ను సిద్ధం చేశారు అధికారులు. దీనిపైనే సీఎం తొలి సంతకం చేయబోతున్నారని తెలియజేశారు.

200 యూనిట్ల వరకూ ఉచితవిద్యుత్, కోటిన్నరమంది మహిళలకు నెలకు రెండువేల రూపాయల స్కీమ్, బిపిఎల్ వర్గాల వారికి ఉచితంగా 10 కిలోల బియ్యం, నిరుద్యోగ భృతి కింద డిగ్రీ చదివిన వారికి నెలకు మూడువేలు, డిప్లమా హోల్డర్స్‌కు 1500 రూపాయలు, మహిళలకు ఆర్టీసీ బస్సుల్లో ఉచిత ప్రయాణం ఫైల్స్ ఈ ఐదు పథకాల జాబితాలోకి వస్తున్నాయి. కాగా కొత్త ప్రభుత్వం కోసం అసెంబ్లీ,సచివాలయాన్ని సిద్దం చేస్తున్నారు. కొత్త సీఎం ఎవరనే విషయంపై ఉత్కంఠతో పాటు ఎక్కడ ప్రమాణస్వీకారం చేస్తారనేది కూడా ప్రశ్నగా మారింది. కొత్త ప్రభుత్వం ఈ నెల 18 వతేదీన కొలువుతీరనుంది.