Home Page SliderTelangana

ప్రభుత్వాలను కూల్చిన  చరిత్ర బీజేపీది: బీఆర్ఎస్

Share with

అధికార దాహంతో పార్టీ ఫిరాయింపులను నాడు బీఆర్ఎస్, నేడు కాంగ్రెస్ ప్రోత్సహిస్తున్నాయంటూ టీ బీజేపీ ఎక్స్‌లో పోస్ట్ చేసింది. దీనిపై బీఆర్ఎస్ స్పందిస్తూ చంపినోడే సంతాపం తెలిపినట్టుంది బీజేపీ వ్యవహారం అంటూ మండిపడింది. గత పదేళ్లలో ఉత్తరాఖండ్, మణిపూర్, గోవా, మేఘాలయ, జమ్ము అండ్ కశ్మీర్, అరుణాచల్‌ప్రదేశ్, కర్ణాటక, మధ్యప్రదేశ్, పుదుచ్చేరి, మహారాష్ట్రలో ప్రభుత్వాలను కూల్చిన నీచచరిత్ర బీజేపీది అని విమర్శించింది.