Andhra PradeshHome Page Slider

భారత్‌లో మనుషులకు పొంచిఉన్న బర్డ్‌ఫ్లూ ముప్పు

Share with

భారత్‌లో బర్డ్‌ప్లూ మనుషులకు సోకడం దేశవ్యాప్తంగా కలకలం సృష్టిస్తోంది. కాగా  పశ్చిమ బెంగాల్‌కు చెందిన ఓ 4 ఏళ్ల బాలుడికి బర్డ్ ఫ్లూ సోకినట్లు WHO తాజాగా వెల్లడించింది. అయితే ఫిబ్రవరిలో ఆ బాలుడిని స్థానిక ఆస్పత్రిలో చేర్పించారు. బాబు దాని నుంచి కోలుకుని 3 నెలల తర్వాత  డిశ్చార్జ్ అయ్యాడని తెలిపింది. ఆస్పత్రిలో ఉన్న సమయంలో ఆ బాబు తీవ్రమైన శ్వాసకోశ సమస్యలు ,అధిక జ్వరం వంటి లక్షణాలతో బాధపడ్డారని పేర్కొంది. కాగా అతని కుటుంబంలోని ఇతరులకు సోకలేదని చెప్పింది. భారతదేశంలో బర్డ్‌ఫ్లూ మనుషులకు సోకడం ఇది రెండోసారి. అయితే భారత్‌లో మొదటి కేసు 2019లో నమోదైంది.